ఎన్టీఆర్ ఎఫెక్ట్ చంద్రబాబుపైన: అసెంబ్లీ బరిలో వైసిపి నుంచి మామ

First Published Feb 28, 2019, 2:43 PM IST

ఎన్టీఆర్ ఎఫెక్ట్ చంద్రబాబుపైన:  అసెంబ్లీ బరిలో వైసిపి నుంచి మామ 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోవడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.
undefined
పార్టీ పరంగా నేతలు పార్టీలు మారితే ఏదో సర్ధిచెప్పుకునే చంద్రబాబుకు కుటుంబ సభ్యులు, బంధువులు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాంలు వైసీపీ కండువా కప్పుకున్నారు.
undefined
దగ్గుబాటి వైసీపీలో చేరిన తలనొప్పి నుంచి తేరుకోకముందే మరో తలనొప్పి ఎదురైంది చంద్రబాబు నాయుడుకు. జూ.ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ, నార్నె రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. నార్నె శ్రీనివాసరావు గురువారం లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
undefined
జూ.ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు జూ.ఎన్టీఆర్ ని ఎన్నికల ప్రచారంలో దింపారు
undefined
ఆ తర్వాత మళ్లీ జూ.ఎన్టీఆర్ పేరెత్తలేదు. జూ.ఎన్టీఆర్ ని తెరపైకి తెస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు ముందే ఊహించి ఆయనను పక్కకు తప్పించారని జోరుగా ప్రచారం జరిగింది. లోకేష్ కు ఎక్కడ పోటీ వస్తారో అన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారని గుసగుసలు కూడా వినిపించాయి. కొందరైతే లోకేశ్ కోసం జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు తొక్కేశారంటూ ఆరోపణలు కూడా చ్చాయి.
undefined
ఆ పరిణామాలతోనే జూ.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తన సోదరి నందమూరి సుహాసిని పోటీ చేసినా జూ.ఎన్టీఆర్ స్పందించలేదు. కేవలం ఒక ప్రెస్ నోట్ తో సరిపెట్టేశారు. జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారంటూ ఆయన అభిమానులు, సుహాసిని కూడా ఆశించి భంగపడ్డారు.
undefined
అయితే ఎన్టీఆర్ మాత్రం సుహాసిని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సుహాసిని తరపున ఎన్నికల ప్రచారానికి హాజరుకాలేదు. అందుకు చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ కు పొసగకపోవడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం జూ.ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలి అనేది అధినేత నిర్ణయం అంటూ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశం పార్టీ అధినేతకే వదిలేస్తున్నట్లు ప్రకటించారు.
undefined
అసలు విషయం అదికాదని తెలుస్తోంది. గుంటూరు పార్లమెంట్ నుంచి నార్నెశ్రీనివాసరావు పోటీ చెయ్యాలనుకుంటున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ టికెట్ కుదరకపోతే చిలుకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ సమాచారం.
undefined
నార్నె శ్రీనివాస్ విషయానికి వస్తే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులలో ఈయన ఒకరు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొద్దిమందికే పరిచయం అయిన నార్నె జూ. ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామగా తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమయ్యారు. నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో జూ.ఎన్టీఆర్ వివాహం జరిగిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుటుంబానికి, జూ.ఎన్టీఆర్ కుటుంబానికి విబేధాలు ఏర్పడ్డాయంటూ ప్రచారం జరుగుతుంది.
undefined
ఇకపోతే నార్నె శ్రీనివాసరావు చిలుకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని గతంలో ప్రయత్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్దమెుత్తంలోనే సంపాదించిన నార్నె శ్రీనివాసరావు గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు కూడా
undefined
చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఆనాటి నుంచి చంద్రబాబు కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వకపోవడంతో నార్నె శ్రీనివాసరావు 2014 ఎన్నికల సమయంలోనూ వైఎస్ జగన్ ను కలిశారు. అయితే టికెట్ కన్ఫమ్ కాకపోవడంతో ఆయన దూరంగా ఉండిపోయారు.
undefined
అయితే 2019 ఎన్నికల్లో టికెట్ పై వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కన్ఫమ్ చేసుకునేందుకు ఇటీవల వైఎస్ జగన్ తో భేటీ అయ్యారని టికెట్ పై జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముహూర్తం చూసుకుని పార్టీ కండువా కప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానైనా రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నార్నె శ్రీనివాసరావు మంచి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
వైఎస్ జగన్ సైతం గెలుపుగుర్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో నార్నె శ్రీనివాసరావుకు గుంటూరు పార్లమెంట్ లేదా చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్లలో ఏదో ఒకటి ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గం ఇంచార్జ్ గా విడుదల రజనీ కొనసాగుతున్నారు. ఆమె గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
undefined
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్నలను అందుకుంటున్నారు. అయితే విడుదల రజనీ అందర్నీ కలుపుకుపోవడం లేదని, సీనియర్లను పక్కన పెడుతోందని, కార్యకర్తల మనోభవాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో వెళ్తున్నారంటూ జగన్ కు నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట
undefined
దీంతో నార్నె శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తున్నట్లు వైఎస్ జగన్ ఆమెతో కూడా చెప్పేశారంటూ ప్రచారం జరుగుతుంది. మంచి ముహూర్తం చూసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ నార్నె శ్రీనివాసరావుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు గత రెండేళ్లుగా నార్నె శ్రీనివాసరావుకు, అల్లుడు జూ.ఎన్టీఆర్ కు మాటలు లేవని ఒక ఆస్థివివాదంలో ఇద్దరు మాట్లాడుకోవడం లేదని ప్రచారం కూడా ఉంది.
undefined
మామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అల్లుడు జూ.ఎన్టీఆర్ ఏమేరకు సహకరిస్తారో అన్నది వేచి చూడాలి. మామకు ప్రచారం చేస్తారా అన్నదాంట్లో సందేహం నెలకొంది. జూ.ఎన్టీఆర్ గతంలోనే రాజకీయాలపై ఒక క్లారిటీ ఇచ్చారు. కట్టెకాలేవరకు తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు
undefined
అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రవులు ఉండరన్నది వాస్తవం. రాజకీయాల్లో శాశ్వత శత్రువుగా ఉండే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలవగా లేనిది మామ నార్నె శ్రీనివాసరావు తరపున జూ.ఎన్టీఆర్ ప్రచారం చేస్తే తప్పేంటన్న వాదన కూడా లేకపోలేదు. మెుత్తానికి జూ.ఎన్టీఆర్ రూపంలో తెలుగుదేశం పార్టీకి కొత్తచిక్కులు వచ్చి పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది.
undefined
click me!