చంద్రబాబు మరో టార్గెట్ పెద్దిరెడ్డి: ఆయనపై మంత్రి మరదలు దూకుడు

First Published Mar 7, 2019, 11:34 AM IST

రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నారు పెద్దిరెడ్డి. అందువల్లే ఆయన చిత్తూరు జిల్లా బోర్డర్ కూడా దాటడం లేదు. వరుస విజయాలు సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మళ్లీ పట్టం కడతారా లేక అనీషారెడ్డిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాలి. 

ఆ జిల్లా రాజకీయ వ్యవహారాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీని అన్నీ తానై నడిపిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సమరానికి సై అంటోంది మంత్రి అమర్ నాథ్ రెడ్డిగారి మరదలు.
undefined
రెండు పర్యాయాలు విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ్యాట్రిక్ సాధించకుండా తాను అడ్డుకట్టవేస్తానని సవాల్ విసురుతోంది. పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల, పులిచర్ల, సదుం, సోమల, పుంగనూరు మండలాల్లో పెద్దిరెడ్డికి మంచి పట్టుంది.
undefined
అందువల్లే ఆయన రెండుసార్లు కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పుంగనూరు అసెంబ్లీ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
undefined
సమీప టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణరాజుపై 60వేల మెజారిటీతో గెలుపొందారు. రెండుసార్లు వరుస విజయాలు అందుకున్న ఆయన రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ఆశపడుతున్నారు. ఆదిశగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కూడా.
undefined
నియోజకవర్గంలో తనకున్న ఫాలోయింగ్, బలమైన క్యాడర్ తన విజయానికి దోహదపడతాయని ఆయన ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ప్రచారం మెుదలుపెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు.
undefined
అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయానికి అడ్డుకట్ట వెయ్యాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుంటే ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాయలసీమను ప్రభావితం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు.
undefined
దీంతో తండ్రీ కొడుకులకు అడ్డుకట్ట వెయ్యాలనే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పెద్దిరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే అనీషారెడ్డిని బరిలోకి దించారు చంద్రబాబు నాయుడు.
undefined
దివంగత నేత నూతనకాల్వ రామక్రిష్ణారెడ్డి చిన్న కొడలు, మంత్రి అమర్ నాథ్ రెడ్డికి స్వయానా మరదలు అయిన అనీషారెడ్డి అయితే పెద్దిరెడ్డిని ఓడించగలదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆర్ధికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో ఆమె పెద్దిరెడ్డికి సరైన రాజకీయ ప్రత్యర్ధి అవుతారని చంద్రబాబు నాయుడి నమ్మకం.
undefined
అనీషారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారో లేదో వెంటనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడే అనీషారెడ్డిని పుంగనూరు అభ్యర్థిగా ప్రకటించడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు టికెట్ కన్పమ్ చెయ్యడంతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు.
undefined
అనీషారెడ్డి రాజకీయ నేపథ్యం రెండు జిల్లాలలో విస్తరించి ఉంది. కడప జిల్లా రాయచోటి మండలంబాలిరెడ్డిగారి పల్లెకు చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కె.రఘురామిరెడ్డి కూతురే అనీషారెడ్డి. మంత్రి అమర్ నాథ్ రెడ్డికి స్వయానా మరదలు.
undefined
అమర్ నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి భార్య. ఎల్ ఎల్ బీ చదివిన అనీషారెడ్డికి రాజకీయాలపట్ల ఆసక్తి ఎక్కువ. అయితే చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడుని కలిసిన ఆమె తన మనసులో మాట చంద్రబాబు చెవిలో పడేశారు.
undefined
పుంగనూరులో పెద్దిరెడ్డికి ఎలా అడ్డుకట్ట వెయ్యాలని ఆలోచిస్తున్న చంద్రబాబుకు అనీషారెడ్డి ఎదురవ్వడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. అమరావతికి వచ్చి కలవాలని ఆదేశించడం, పార్టీలో చేరడం పుంగనూరు టికెట్ కేటాయించడం చకచకా జరిగిపోయాయి.
undefined
అటు పుట్టింటి వారిది, ఇటు అత్తింటి వారిది రాజకీయ కుటుంబ నేపథ్యం కావడంతో అనీషారెడ్డి విజయానికి దోహదపడే అంశాలని టీడీపీ భావిస్తోంది. పక్క నియోజకవర్గమైన పీలేరు టీడీపీ అభ్యర్ధి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బలగం కూడా అనీషారెడ్డికి కలిసి వస్తోందని తెలుస్తోంది.
undefined
దీనికి తోడు అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, పసుపు – కుంకమ పథకాలు తమకు వరంగా మారతాయని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పుంగనూరు ఫైట్ రాబోయే ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ అంటూ ప్రచారం జరగుతోంది.
undefined
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించేలా ప్లాన్ వేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన అధికార పార్టీ ఎత్తుకు పై ఎత్తు వ్యూహాలను రచిస్తున్నారు.
undefined
రాజకీయ బద్దశత్రువు అయిన చంద్రబాబుకు, అటు ఫిరాయింపు ఎమ్మెల్యే మంత్రి అమర్ నాథ్ రెడ్డికి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కిషోర్ కుమారెడ్డిలకు చుక్కలు చూపించాలని వ్యూహరచన చేస్తోన్నారు పెద్దిరెడ్డి.
undefined
రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నారు పెద్దిరెడ్డి. అందువల్లే ఆయన చిత్తూరు జిల్లా బోర్డర్ కూడా దాటడం లేదు. వరుస విజయాలు సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మళ్లీ పట్టం కడతారా లేక అనీషారెడ్డిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాలి.
undefined
click me!