గ్యాస్ లీక్ వదంతులను నమ్మొద్దు.. బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు

First Published May 12, 2020, 5:05 PM IST

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజ్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను మంగళవారం వైసీపీ నేతలు పరామర్శించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరిలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి, విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు ఉన్నారు. 

ప్రస్తుతం 367 మంది చికిత్స పొందుతున్నారని, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నవారిని 200 మంది వరకు ఆసుపత్రి నుండి విడుదల చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల పై ఈ రోజు ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్యంతో విడుదలైన వారికి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి వారి స్వగృహాలకు పంపనున్నట్లు కన్నబాబు తెలిపారు.
undefined
రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కె.జి.హెచ్.లో 300 మంది చికిత్స పొందుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 67 మంది ఉన్నారన్నారు. ఈ రోజు 200 మంది వరకు ఆరోగ్యంగా ఉన్నవారిని ఆసుపత్రి నుండి విడుదల చేస్తారని, వారి వారి గృహాలకు వెల్లేందుకు రవాణా సౌకర్యం కల్పించమని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పినట్లు తెలిపారు.
undefined
మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని, చికిత్స బాగా జరుగుతుందని తెలిపారు. 5 గ్రామాల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని, ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, గ్రామాల్లో నివాస యోగ్యంగా ఉన్నదని, గ్రామస్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయా గ్రామాల్లోనే రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు రాత్రి బస చేసినట్లు వివరించారు.
undefined
ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు నివాసం ఉంటున్నట్లు విజయసాయి చెప్పారు. గ్రామాల ప్రజలకు వైద్య పరీక్షలు చేసేందుకు ఐదుగురు వివిధ రంగాల వైద్యులు వెళ్ళి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పరిహారం అందించేందుకు ఎన్యూమరేషన్ జరుగుతోందన్నారు.
undefined
ఎల్.జి. పాలిమర్స్ బాధితులు ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఎన్యూమరేషన్ చేయిస్తున్నట్లు జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అందరూ సంయమనం పాటించాలన్నారు.
undefined
click me!