ఆర్ధిత సేవలను రద్దు చేసుకొన్న భక్తులకు టీటీడీ నగదును తిరిగి చెల్లించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్జిత, దర్శన సేవా టిక్కట్లను పొందిన భక్తులకు నగదును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.ఈ మేరకు టీటీడీ భక్తులకు నగదును చెల్లించినట్టుగా ప్రకటించింది.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా టీటీడీ ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. లాక్ డౌన్ పై కేంద్రం తీసుకొనే నిర్ణయం ఆధారంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
undefined
ఆర్జిత సేవా టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు టీటీడీ డబ్బులను తిరిగి చెల్లించింది.మార్చి 14 నుండి మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవా టిక్కెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొంది. టీటీడీ వినతి మేరకు 2.50 లక్షల మంది భక్తులకు నగదును తిరిగి ఇచ్చింది.
undefined
45 శాతం భక్తులు తమ దర్శనం టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకొన్నారు.రద్దు చేసుకొన్న ఆర్దిత సేవ టిక్కట్ల కోసం 1.93 లక్షల నగదును భక్తులకు టీటీడీ చెల్లించింది.ఇంత సుధీర్ఘ కాలం పాటు ఆలయం మూసివేయడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమంగా స్థానికులు చెబుతున్నారు.
undefined
ఇక టీటీడీ ఈ దఫా భారీగా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.ఐదేళ్ల తర్వాత ఇంత మొత్తంలో నిధులను డిపాజిట్ చేయడం ఇదే ప్రథమం.2019-20 ఆర్ధిక సంవత్సరానికి టీటీడీ రూ. 700 కోట్లు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ చేసింది.
undefined
గత ఏడాది రూ. 507 కోట్లను డిపాజిట్ చేసింది. 2015-16లో రూ. 784 కోట్లను టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.2015 తర్వాత బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. టీటీడీకి బ్యాంకుల్లో సుమారు రూ. 14 వేల కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.
undefined