YSRCP: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి అదేంటో ఈ వార్తలో చూసేద్దాం.
వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకునే దిశగా అడుగులు పడనున్నాయి. ఈ మేరకు పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల తర్వాత జగన్.. పార్టీ పునర్నిర్మాణం, స్థానిక నాయకత్వంపై లోతైన సమీక్ష చేపట్టారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు, కొత్త వ్యూహాలతో పార్టీని పునర్నిర్మించాలని జగన్ ఆలోచిస్తున్నారట.
25
ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ
2024 ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఓటమితో జగన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఈ ఓటమి వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు జిల్లావారీగా సమావేశాలు, నాయకులతో మీటింగ్స్ చేపట్టారు పార్టీ అధినేత. స్థానిక స్థాయిలో అసంతృప్తి, కమ్యూనికేషన్ లోపం, ప్రజలతో మమేకం కానీ అంశాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజలతో మమేకమయ్యే యువ నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
35
కడపలో మారనున్న సమీకరణాలు
జగన్ నియోజకవర్గం అయిన కడప జిల్లాలో త్వరలోనే సమీకరణాలు మారనున్నట్టు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిపై గత కొంతకాలంగా వివాదాలు, కేసులు చుట్టుముట్టాయి. ఇక అవి కాస్తా పార్టీ ఇమేజ్‌కి ప్రతికూలంగా మారినట్లు అంచనా. దీనికి బదులుగా యువనేత దుశ్యంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు వైఎస్ జగన్. జమ్మలమడుగు ప్రాంతంలో ఆయనకు ఉన్న బలమైన ప్రజాధరణ, రెడ్డి వర్గం మద్దతు కారణంగా దుశ్యంత్ రెడ్డి పేరు ఇప్పుడు పార్టీలో గట్టి చర్చకు దారి తీసింది.
పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా అవినాష్ రెడ్డిని పులివెందుల నుంచి తప్పించి, జమ్మలమడుగు లేదా మిడుకూరు బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచన జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా వైసీపీలో అంతర్గత సమతుల్యతను కాపాడేందుకేనని సమాచారం. అవినాష్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టకుండా తగిన పరిపాలనా లేదా రాజకీయ బాధ్యతలు ఇవ్వాలనే ప్రణాళికను రచిస్తున్నారట వైఎస్ జగన్.
55
యువ నాయకత్వం వైపు వైసీపీ దృష్టి
ప్రజలతో మమేకమైయ్యే నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారు. యువతతో మమేకమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. దుశ్యంత్ రెడ్డి వంటి నాయకులను ముందుకు తెచ్చి, కొత్తతరం నాయకత్వం ద్వారా ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి కొత్త ఊపుని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు వైఎస్ జగన్.