సోనియా పిలుపు: జగన్ ఏమైనా చంద్రబాబా అంటూ సెటైర్లు

First Published May 16, 2019, 1:09 PM IST

అమరావతి: రాజకీయాల్లో ఏం చేసినా టైమింగ్ ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో బాగా నిలదొక్కుకోవచ్చని నానుడి. అది యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి చెల్లుతుంది. ఆమె అదృష్టమో లేక కాలం కలిసివచ్చిందో లేదో తెలియదు గానీ పదేళ్లపాటు దేశ రాజకీయాలను శాసించారు. 
 

అమరావతి: రాజకీయాల్లో ఏం చేసినా టైమింగ్ ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో బాగా నిలదొక్కుకోవచ్చని నానుడి. అది యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి చెల్లుతుంది. ఆమె అదృష్టమో లేక కాలం కలిసివచ్చిందో లేదో తెలియదు గానీ పదేళ్లపాటు దేశ రాజకీయాలను శాసించారు.
undefined
కనుసైగతో దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీకి ఇలాంటి పరిస్థితే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నఆయన నక్కతోక తొక్కి వచ్చారో ఏమో తెలియదు కానీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ఆ తర్వాత ప్రధాని పీఠాన్ని అధిరోహించడం చకచకా జరిగిపోయాయి.
undefined
రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా ఊహించడం కూడా కష్టం అన్నట్లు ఇప్పుడు యూపీఏ, ఎన్డీఏలకు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని హంగ్ వస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
undefined
ఎన్డీఏను ఎలాగైనా గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ ఏకంగా 21 పార్టీలతో జతకట్టి వ్యూహరచన చేస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఉండరంటారు అన్న సామెతను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రువుగా పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీతో జతకట్టింది.
undefined
ఒకప్పటి రాజకీయ శత్రువులు ఆకస్మాత్తుగా మిత్రులు కూడా అయిపోవచ్చు అనడానికి ఇదే నిదర్శనం కావచ్చు. 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు పలికిన చంద్రబాబు 2019 ఎన్నికలు వచ్చేసరికి యూపీఏకు మద్దతు పలికారు. యూపీఏ పరిస్థితి అలా ఉంటే ఈసారి కూడా మళ్లీ తామే అధికారంలోకి రావాలంటూ బీజేపీ గట్టిగానే పావులు కదుపుతుంది.
undefined
అందుకు వ్యూహాలను సైతం సిద్ధం చేసింది. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు కలిసి వచ్చే పార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఆయా పార్టీల అధినేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు లేఖలు సైతం రాశారంటూ ప్రచారం జరుగుతుంది. తమకు ఎలాంటి లేఖలు రాలేదంటూ అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీ స్పష్టం చేస్తోంది. అయితే సోనియాగాంధీయే నేరుగా పార్టీ అధినేతలతో మాట్లాడుతున్నారంటూ మరో వార్త హల్ చల్ చేస్తోంది.
undefined
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ లేఖ రాశారంటూ వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ఉన్న సోనియాగాంధీ అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నానా ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
undefined
జగన్ ఆస్తులపై కేసుల కుట్ర కాంగ్రెస్ దేనని విమర్శిస్తున్నారు. ఆనాడు అధికారంతో తమ నేతను ఇబ్బందులకు గురిచేసి జైల్లో పెట్టించి ఇప్పుడు మద్దతు కోరతరా అంటూ మండిపడుతున్నారు. ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు అంటే ఇదేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
undefined
ఇదిలా ఉంటే సోనియాగాంధీ లేఖ రాసినా లేకపోతే వైఎస్ జగన్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడినా జగన్ మాత్రం యూపీఏకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తనను కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను వైఎస్ జగన్ మరచిపోలేదని తెలుస్తోంది.
undefined
ఈ నేపథ్యంలో యూపీఏకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. మరోవైపు తమ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు యూపీఏలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో యూపీఏకు మద్దతివ్వడం కంటే పెద్ద పొరపాటు ఏమీ ఉండదని జగన్ తన అనుచరులు వద్ద అన్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానిస్తే ఢిల్లీ వెళ్లడానికి తమ నేత ఏమైనా చంద్రబాబు నాయుడా అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
undefined
click me!