మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

First Published | Dec 11, 2023, 3:18 PM IST

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ మూడు వేల కి.మీ. పూర్తి చేసుకుంది.పాదయాత్ర మూడు వేల కి.మీ. పూర్తి చేసుకున్న నేపథ్యంలో తుని నియోజకవర్గంలో  పైలాన్ ను  ఆవిష్కరించారు.
 

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు మూడు వేల కి.మీ. లకు చేరుకుంది. పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజుల కొత్తూరు  వద్ద  పైలాన్ ను  ఆవిష్కరించారు  నారా లోకేష్.

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

ఈ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో   లోకేష్ సతీమణి  నారా బ్రహ్మణి, లోకేష్ తోడల్లుడు శ్రీభరత్,  బాలకృష్ణ తనయుడు  మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు.  లోకేష్ తో కలిసి  బ్రహ్మణి, ఆమె తనయుడు  దేవాన్ష్,  మోక్షజ్ఞ , శ్రీభరత్ లు  కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు

Latest Videos


మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

2023 జనవరి  27వ తేదీన  నారా లోకేష్  యువగళం పేరుతో  కుప్పం  నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు.  రాష్ట్రంలో 400 రోజుల పాటు  4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని  లోకేష్  ప్లాన్ చేసుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సైకిల్ యాత్ర చేయాలని లోకేష్ భావించారు. అయితే  ఆ సమయంలో  చంద్రబాబునాయుడు  పాదయాత్ర కారణంగా  లోకేష్ సైకిల్ యాత్ర చేయలేకపోయారు.  

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  అధికారానికి దూరమైంది.పార్టీ క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు  ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు గాను  పాదయాత్ర చేయాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు  ఈ ఏడాది జనవరి  27న కుప్పంలో పాదయాత్రను ప్రారంభించారు.  రాష్ట్రంలోని  100 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగేలా  రూట్ మ్యాప్ ను  రూపొందించారు. 

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

ఈ ఏడాది సెప్టెంబర్  9వ తేదీన  నంద్యాలలో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును  ఏపీ సీఐడీ  అధికారులు  అరెస్ట్ చేశారు.దీంతో  లోకేష్ తన పాదయాత్రను అదే రోజున నిలిపివేయాల్సి వచ్చింది.చంద్రబాబుపై వరుస కేసులు నమోదు కావడంతో  న్యూఢిల్లీలో  న్యాయనిపుణులతో చర్చల నిమిత్తం లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  రెగ్యులర్ బెయిల్ కూడ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో  ఈ ఏడాది నవంబర్  27వ తేదీన  లోకేష్  తన పాదయాత్రను పున:ప్రారంభించారు.  డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుండి  లోకేష్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు.  ప్రతి రోజూ  15 నుండి 20 కి.మీల పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,648 కి.మీ. పాదయాత్ర చేశారు.  
2017 నవంబర్  6వ తేదీన  కడప జిల్లా ఇడుపులపాయలో  జగన్  తన పాదయాత్రను ప్రారంభించారు.  2019 జనవరి 9వ తేదీన  శ్రీకాకుళం జిల్లా  ఇచ్చాపురం వద్ద ముగించారు.341 రోజుల పాటు  3,648 కి.మీ. దూరం నడిచారు.  2,516 గ్రామాల గుండా ఈ పాదయాత్ర సాగింది.  

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2003 ఏప్రిల్ 9వ తేదీన చేవేళ్లలో పాదయాత్రను ప్రారంభించారు.  68 రోజులకు  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  11 జిల్లాల్లోని  56 నియోజకవర్గాల్లో  ఈ యాత్ర సాగింది.  68 రోజుల్లో  1475 కి.మీ. దూరం పాదయాత్ర నిర్వహించారు.  2003 జూన్  15న ఇచ్ఛాపురంలో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించారు.

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్


2012 అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు నాయుడు  హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  13 జిల్లాల్లో ఈ పాదయాత్ర సాగింది.  13 జిల్లాల్లోని  2817 కి.మీ. చంద్రబాబు నడిచారు.   2013 ఏప్రిల్  28న విశాఖలోని ఆగనంపూడి వద్ద  చంద్రబాబునాయుడు తన పాదయాత్రను ముగించారు.ఇప్పటికే  చంద్రబాబు పాదయాత్ర రికార్డును లోకేష్ బద్దలు కొట్టారు.చంద్రబాబునాయుడు  208 రోజుల్లో  2817 కి.మీ. నడిచారు. లోకేష్ మాత్రం  206 రోజుల్లోనే 2817 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు.

మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్

ఇప్పటికే  చంద్రబాబు పాదయాత్ర రికార్డును లోకేష్ బద్దలు కొట్టారు.చంద్రబాబునాయుడు  208 రోజుల్లో  2817 కి.మీ. నడిచారు. లోకేష్ మాత్రం  206 రోజుల్లోనే 2817 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు.

click me!