నా మద్దతు బీఆర్ఎస్ కే... తేల్చిచెప్పిన నటుడు సుమన్...

Published : May 11, 2023, 09:40 AM IST

తెలంగాణలో బీఆర్ఎస్ కు  మద్దుతు ఇస్తానని నటుడు సుమన్ తేల్చి చెప్పారు. ఏపీలోని మొగల్తూరులో బుధవారం మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. 

PREV
14
నా మద్దతు బీఆర్ఎస్ కే... తేల్చిచెప్పిన నటుడు సుమన్...

మొగల్తూరు : చక్కటి నటుడిగా సుమన్ కి మంచి పేరు ఉంది.  నటుడు గానే కాకుండా ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేసే వ్యక్తిగా కూడా సుమన్ కి గుర్తింపు ఉంది. బుధవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటి తిప్ప గ్రామంలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. 

24

కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సతినేని శ్రీనివాస తాతాజీ ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా అందులో సుమన్ మాట్లాడారు.

34
brs

తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తల మీద క్లారిటీ ఇచ్చారు.  తెలంగాణలో అయితే బీఆర్ఎస్ కే తన మద్దతును ఇస్తానని తెలిపారు. విపత్తులు, వర్షాలు ఏటా వస్తునే ఉంటాయని..  వాటినుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో అనేది ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అన్నారు.  

44

అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పకు వచ్చారు.  రైతులు కోరేది కొంచమేనని అన్నారు. ఏ ప్రభుత్వమైనా వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. 

Read more Photos on
click me!

Recommended Stories