విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి : ‘ఇదే నాకు చివరి రోజు కావచ్చు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో..’ పోస్ట్ పెట్టి

First Published | May 11, 2023, 9:09 AM IST

విజయవాడలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపిన ఘటనలో.. ఇది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. అతనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతకుముందు.. ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టాడు. 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పంట పొలాల్లో సగం కాలిన స్థితిలో ఓ విద్యార్థి మృతదేహం నిన్న కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే చనిపోయే కొద్ది గంటలకు ముందు అతను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ‘ఇదే నాకు చివరి రోజు కావచ్చు’ అని  పోస్ట్ పెట్టడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ పోస్ట్ చూసిన ఓ స్నేహితుడు దాన్ని వెటకారం చేశాడో. దానికి కూడా  అతని రిప్లై ఇస్తూ ‘ రాత్రి నీకే తెలుస్తుందిలే..’ అని పెట్టుకోవచ్చాడు.  

అది జరిగిన ఎనిమిది గంటల్లోనే అతను పోస్ట్ ఎందుకు పెట్టాడో తెలిసింది. ఆ యువకుడే విజయవాడ శివారులోని పంట పొలాల్లో అనుమానాస్పద స్థితిలో కాలిపోయి మృతి చెందిన జీవన్ కుమార్.
మొదట దీనిని హత్యగా భావించారు. కానీ, జీవన్ కుమారే.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లుగా తేలింది. 


పెనుమలూరు మండలం పెద్దపులిపాక గ్రామ పరిధిలో మూడంతులకు పైగా కాలిపోయిన స్థితిలో.. గుర్తుపట్టడానికి వీలు లేకుండా స్థితిలో బుధవారం ఉదయం ఓ మృతదేహం కనిపించింది. వెంటనే స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో  జీవన్ కుమార్ చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది.  మొదట పెనుమలూరు పోలీసులు దొరికిన ఆనవాళ్లను బట్టి హత్య కేసు నమోదు చేసిన ఆ తర్వాత ఆత్మహత్య అయి ఉండొచ్చు అని అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో జమ్మలమడుగు జీవన్ (21) అనే యువకుడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు నాగమణి, సుధాకర్ లు తొట్లవల్లూరు మండలం వల్లూరు పాలెంలో ఉంటున్నారు. వీరికి జీవన్ కుమార్ తో పాటు మరో కుమార్తె కూడా ఉంది. ఆమెకు వివాహం అయ్యింది. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా జీవన్ కుమార్ తండ్రి సుధాకర్ పని చేస్తున్నాడు.  

ఇటీవల తండ్రి సుధాకర్ జీవన్ కుమార్ కు ఈఎంఐ కట్టమని రూ.12 వేలు  ఇచ్చాడు. అయితే జీవన్ కుమార్ లోను కట్టకుండా ఆ డబ్బును తన అవసరాలకు ఖర్చు చేసుకున్నాడు. ఇది తండ్రికి తెలియడంతో రెండు రోజుల క్రితం అతడు కొడుకుని మందలించాడు. తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన జీవన్ కుమార్ ఇంట్లో నుంచి సోమవారం వెళ్ళిపోయాడు. ఆ రాత్రి స్నేహితుడి ఇంట్లోనే పడుకున్నాడు. మంగళవారం ఇంటికి వచ్చాడు.

సాయంత్రం తన స్నేహితుడి బర్త్డే పార్టీ ఉందని ఇంట్లో తల్లికి చెప్పి బయటికి వెళ్లాడు. అదే సమయంలో.. ఇదే తన చివరి రోజు అని ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. అది చూసిన స్నేహితుడు వెటకారం చేయగా.. సరేలే ఈరోజు రాత్రికి నీకే తెలుస్తుంది…అని కామెంట్ కూడా చేశాడు. ఆ తర్వాత  గురునానక్ కాలనీలోనే ఓ హోటల్లో జరిగిన తన స్నేహితుడు శ్యాం పుట్టినరోజు పార్టీకి కూడా హాజరయ్యాడు. రాత్రి 9 గంటలకు తల్లి నాగమణి ఫోన్ చేస్తే.. మామూలుగానే మాట్లాడి పార్టీ అయిపోయిన తర్వాత 11 గంటలకు ఇంటికి వస్తానని తెలిపాడు.

vijayawada student

ఆ తర్వాత స్నేహితులతో కలిసి అక్కడే నిద్రపోయాడు. రాత్రి 12:30 గంటలకు తన ఇంటికి వెళ్లాలంటూ స్నేహితుడిని నిద్రలేపి టూ వీలర్  తాళాలు తీసుకుని వెళ్లిపోయాడు. అలా వెళ్ళిన జీవన్ కుమార్ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో  యనమలకుదురులోని ఓ పెట్రోల్ బంకులో..  100 రూపాయల పెట్రోల్ ను సీసాలో పోయించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి సుధాకర్ కు ఫోన్ చేశాడు. ఈఎంఐ కట్టమని ఇచ్చిన డబ్బులు తన సొంతానికి వాడుకుని ఇబ్బంది పెట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు… తల్లితో కూడా  మాట్లాడాడు.

‘మిమ్మల్ని ఎప్పుడూ నేను నిరాశ పరుస్తూనే ఉన్నాను.. నాన్నను నేను సంతోషపెట్టలేకపోతున్నాను.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.. . నన్ను భరించి నందుకు థాంక్యూ అమ్మ’.. అంటూ ఫోన్ పెట్టేసాడు.  దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు జీవన్ కి మళ్ళీ మూడు సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. పెట్రోల్ ను తలపై పోసుకొని నిప్పంటించుకుని సంఘటన స్థలంలోనే చనిపోయాడు.   బుధవారం ఉదయం పెదపులిపాక రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పెదపులి పాక- చోడవరం కరువు కాలువ కట్టకు ఫర్లాంగు దూరంలో ఉన్న డొంక రోడ్డులో మృతదేహం పడి ఉంది. మృతదేహం తల నుంచి కాళ్ల వరకు కాలిపోయి ఉంది. ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా పెట్రోల్ బంకు నుంచి టూవీలర్ మీద ఒక్కడే బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత వైద్యులు ప్రాథమిక నివేదిక  ఇచ్చారు. ఇందులో తలపై పెట్రోల్ పోసుకుంటూ ఉండగా కొంత పెట్రోల్ ఊపిరితిత్తులోకి వెళ్లినట్లుగా గుర్తించారు వైద్యులు.  అతనే తలపై పెట్రోల్ పోసుకుని సొంతంగా నిప్పంటించుకుని మరణించి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. 

Latest Videos

click me!