కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రియుడి సహాయంతో ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేయించింది. మంత్రాలయం మండలం మాధవరంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం మంత్రాలయం ఎస్సై వేణుగోపాల రాజు, మాధవరం ఎస్ఐ కిరణ్ లు వెల్లడించారు. మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ (35) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.
26
రోజులాగే నిరుడు జూన్ 30వ తేదీన కూడా కూలీ పనులకు వెళ్లిన నారాయణ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య ఉప్పర వరలక్ష్మి భర్త కనిపించడం లేదంటూ మాధవరం పోలీస్ స్టేషన్లోలో ఫిర్యాదు చేసింది. దీనిమీద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆ తర్వాత భార్య సెల్ఫోన్ కాల్ డాటా వివరాలను సేకరించారు. అందులో అనుమానితుల జాబితాను తయారు చేసుకుని వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
36
నారాయణకు మద్యం సేవించే అలవాటు ఉంది. రోజు మద్యం తాగి వచ్చి భార్య మీద అనుమాన పడుతూ ఉండేవాడు. అంతే కాదు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడు. ఇవన్నీ విచారణలో వెలుగు చూశాయి. భర్త ఈ ప్రవర్తనతో విసిగిపోయింది భార్య వరలక్ష్మి. ఈ క్రమంలో ఆమెకు సి. బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్న గోవిందుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
46
आगरा के सदर थाना क्षेत्र की रहने वाली महिला की शादी साल 2017 में दिल्ली के एक युवक से हुई थी। उनका एक बेटा भी है।
ఆ తర్వాత భర్తను అంతం అందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడుతో కలిసి పక్కా ప్రణాళిక వేసింది. దీని ప్రకారమే చిన్న గోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం తాగించాడు. ఆ తర్వాత మద్యంమత్తులో ఉన్న అతనిని రైలు పట్టాల మీదికి తీసుకువెళ్లి.. అక్కడ పడుకోబెట్టాడు. వారు అనుకున్నట్టుగానే రైలు నారాయణ మీది నుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత చిన్న గోవిందు వరలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు.
56
train
కాగా వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. నారాయణ చనిపోయిన తర్వాత వరలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసుల విచారణలో వరలక్ష్మి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
66
దీంతో చిన్న గోవిందు, వరలక్ష్మి.. నారాయణను తామే హత్య చేయించినట్లుగా ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరపరిచారు..