బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

First Published | Sep 19, 2019, 11:24 AM IST

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం- కచ్చలూరు మధ్యలో బోటు మునిగిన ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే విషయమై ప్రత్యక్షసాక్లులు మీడియాకు వివరించారు. 

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణీకులు చెప్పారు. మత్స్యకారులు హెచ్చరించినా కూడ పట్టించుకోకుండా బోటును నడపడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని వారు చెబుతున్నారు.
undefined
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు ఈ నెల 15వ తేదీన గోదావరి జిల్లాలో మునిగిపోయింది.ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బోటు ఆచూకీని కనుగొన్నారు. కానీ, బోటు వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined

Latest Videos


ఆదివారం నాడు ఉదయం 11:30 గంటలకు బోటు ఎక్కినట్టుగా ఈ ప్రమాదం నుండి బయటపడిన హైద్రాబాద్‌లోని హయత్‌నగర్ కు చెందిన జరణీకుమార్, అర్జున్ లు చెప్పారు.
undefined
బోటు ప్రమాదం జరగడానికి ముందే కొందరు జాలర్లు ఈ ప్రాంతం ప్రమాదకరంగా ఉంటుందని రెడ్ సిగ్నల్ చూపించారు. కానీ, ఈ హెచ్చరికను పట్టించుకోకుండానే డ్రైవర్ బోటును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం వాటిల్లిందని జరణీకుమార్ అభిప్రాయపడ్డారు.
undefined
ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే బోటు కుదుపుకు గురైనట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు.ఈ సమయంలోనే ఈ ప్రాంతం డేంజర్ జోన్ అని బోటు డ్రైవర్ ప్రకటించారు. అంతేకాదు జాగ్రత్తగా ఉండాలి. రెండు వైపులా సమానంగా కూర్చోవాలని సూచించినట్టుగా వారు తెలిపారు.
undefined
అదే సమయంలో బోటు తిరగబడినట్టుగా బాధితులు జరణీకుమార్, అర్జున్ లు తెలిపారు. భోజనం చేయడం కోసం అందరం లైఫ్ జాకెట్లు తీసేసినట్టుగా వారు గుర్తు చేసుకొన్నారు.
undefined
బోటు మునిగిపోయిన తర్వాతే తాను కూడ నీటిలో మునిగిపోయినట్టుగా అర్జున్ తెలిపారు. నీటిపై తేలగానే అప్పటికే బోటుపై ఉన్న జరణీ కుమార్ నాకు లైఫ్ జాకెట్ ఇచ్చాడని ఆయన గుర్తు చేసుకొన్నారు. అప్పటికే అతను కూడ పక్కనే ఉన్న లైఫ్ జాకెట్ ను వేసుకొని బోటు మీద నిలబడినట్టుగా చెప్పారు.
undefined
బోటు మునిగిపోతున్న సమయంలో పెద్దగా అరుపులు వేయడంతో తూటుగుంట గ్రామస్తులు గమనించి బోటులో తమను ఒడ్డుకు చేర్చారని వారు చెప్పారు. బోటు డ్రైవర్ ముందు జాగ్రత్తలు తీసుకొంటే ప్రమాదం జరగకపోయి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.
undefined
click me!