కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

First Published Sep 19, 2019, 7:09 AM IST

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శిప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని విచారించారు పోలీసులు.

ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసు శాఖ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది.
undefined
ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.
undefined
కోడెల ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కెన్యాలో కోడెల శివరాం ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు పోలీసులకు అందింది. పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
undefined
కోడెల శివప్రసాద్ రావు కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు ముందు 24 నిమిషాల పాటు ఎవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
undefined
మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.
undefined
ఇదిలా ఉంటే కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై ఆయన మేనల్లుడు సాయి నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడెల శివరాంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
undefined
ఈ ఫిర్యాదును పరిశీలించాలని కోరుతూ నర్సరావుపేట పోలీసులు బుధవారం నాడు రాత్రి హైద్రాబాద్ పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపారు. సాయి ఫిర్యాదు వెనుక వైఎస్ఆర్‌సీపీ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
undefined
కోడెల శివప్రసాద్ రావు గత నెలలో తనకు ఫోన్ చేశాడని తనను మానసికంగా వేధింపులకు గురి చేశాడని శివప్రసాద్ రావు తనకు చెప్పాడని సాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
undefined
click me!