ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు..
ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు మండుటెండలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
జిల్లాలవారిగా ఉష్ణోగ్రతల అంచనా..
45°C – 46°C : పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలు.
43°C – 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలు.
40°C – 42°C: శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు