Weather Update : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ తెలుగు జిల్లాల్లో గాలివాన బీభత్సం, బిఅలర్ట్

Published : Jul 11, 2026, 08:00 AM IST

నేడు (జూలై 11) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణం ఉంటుందని వాతావరణ శాక చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, మరికొన్నిచోట్ల ఎండలు కొనసాగుతాయట. ఈ వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

నేడు (జూలై 11, శనివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. అనేక జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటోంది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో సముద్ర ప్రయాణాలు, చేపల వేట వంటి కార్యకలాపాలను మానుకోవాలని అధికారులు హెచ్చరించారు.

25
నేడు తెలంగాణ వాతావరణ ఎలా ఉంటుంది?

తెలంగాణలోని చాలా జిల్లాలకు నేడు (జూలై 11) భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

35
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ (జూలై 11న) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విభిన్న వాతావరణం ఉంటుందట. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటోంది. ఇక కోస్తాంధ్ర జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయంటోంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు వాతావరణ మార్పులను గమనించి, తమ దైనందిన ప్రయాణాలు, బహిరంగ పనులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

45
వర్షాల సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి

వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు కొన్ని తక్షణ జాగ్రత్తలు పాటించాలి.

విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.

రోడ్లపై నీరు నిలిచి ఉన్న చోట్ల ప్రయాణించడం పూర్తిగా మానుకోవాలి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

బహిరంగ పనులు, వ్యవసాయ పనుల ప్రణాళికను వాతావరణ సూచనల ఆధారంగానే చేసుకోవాలి.

అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలి.

ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సురక్షితంగా ఉండటం అత్యవసరం.

55
నేడు అధిక ఉష్ణోగ్రతలు

వర్షాలు లేని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా, కొన్ని చోట్ల వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి రాయలసీమలోని కొన్ని జిల్లాలు, తెలంగాణలోని పశ్చిమ ప్రాంతాల్లో పగటి పూట వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల ప్రజలు నేడు (జూలై 11) ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తపడాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగినంత నీరు, ద్రవాలు తీసుకోవడం ముఖ్యం. బయట పనులు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories