IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్

Published : Sep 12, 2026, 08:39 AM ISTUpdated : Sep 12, 2026, 08:48 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్ర ప్రదేశ్ తీరాానికి చేరుకుంది. దీని ప్రభావంతో నేడు (సెప్టెంబర్ 12) తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది… కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

PREV
14
ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-మధ్య బంగాళాఖాతానికి చేరుకుందని... దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని ఆనుకొని ఉన్న తీర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, దక్షిణ తీరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.

24
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకున్నాయి... పలు ప్రాంతాల్లో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్ 12, శనివారం) శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది...రెడ్ అలర్ట్ జారీచేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్ష సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు, పశువులు కాపర్లు వర్ష సమయంలో చెట్ల కింద ఉండరాదని... సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ముందుజాగ్రత్తగా సూచించింది.

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది, ఈదురుగాలులు బలపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడటం, హోర్డింగులు, ప్లెక్సీలు ఊడిపడి ప్రమాదాలు జరగవచ్చు... కాబట్టి వాటి సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

34
తెలంగాణలోనూ వర్షాలు

అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఇవాళ (సెస్టెంబర్ 12, శనివారం) ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కొమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి తో పాటు మిగతా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఇవాళ హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందట. నగరంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.... మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలుంటాయని హెచ్చరించింది.

44
సెప్టెంబర్ 12, 13, 14 భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండుమూడు రోజులు వర్షాల ప్రభావం కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13,14 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువయ్యే అవకాశం ఉందట. తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతాయంటున్నాయి.

ఇలా ఎల్ నినో సమయంలో వర్షాలు లేక ఆందోళన చెందుతున్న ప్రజలకు అల్పపీడనం కాస్త ఊరట నిస్తోంది. అయితే ఈ వర్షాలు లోటును తీర్చే స్థాయిలో ఉండవని… ఊరటనిచ్చే స్థాయిలోనే ఉంటాయంటున్నారు వాతావరణ నిపుణులు.

Read more Photos on
click me!

Recommended Stories