అందరూ పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ ... ఆయన మాత్రం వారి ఫ్యాన్... ఎంత గొప్పగా చెప్పారో..!

First Published | Aug 13, 2024, 10:56 PM IST

తెలుగు హీరోల్లో అత్యధికంగా ఫ్యాన్స్ కలిగివున్నది పవన్ కల్యాణ్ కే...  ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి పవన్ కొందరిని హీరోలంటూ తెగ పొగిడేసారు. ఇంతలా పవన్ మనసు గెలుచుకున్నది ఎవరంటే...  

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కల్యాణ్ ... తెలుగు ప్రజలు ఎంతో ఇష్టపడే నటుడు. ఇటీవల రాజకీయంగా కూడా అద్భుతం చేసారాయన... అసలు ఓటమన్నదే లేకుండా  100శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించుకున్నారు. ఇలా కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కు కీలకమైన డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎలాంటి పాలనా అనుభవం లేకపోయినప్పటికీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ఇలా కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాలు, పాలనలోనూ హీరోగా నిరూపించుకున్నారు. అలాంటిది ఆయనే అసలైన హీరోలం మేముకాదు... మీరంటూ కొందరిని ఆకాశానికి ఎత్తారు.

Pawan Kalyan

ఇలా పవన్ కల్యాణ్ అంటే అందరూ పడిచస్తుంటే... ఆయన మాత్రం తనకు శాస్త్రవేత్తలే హీరోలు అటున్నారు. దేశం కోసం, ప్రజల కోసం తమ జీవితాలను సైతం లెక్కచేయని మహానుభావులు మన శాస్త్రవేత్తలు... కాబట్టి వారే నిజమైన హీరోలని పవన్ పేర్కొన్నారు. తెరపై కనిపించకుండా దేశంకోసం జీవితాన్ని ధారపోసే శాస్త్రవేత్తలే తనకు స్పూర్తి ప్రధాతలని పవన్ పేర్కోన్నారు. 


Pawan Kalyan

ప్రస్తుతం ప్రతిఒక్కరు ఉపయోగిస్తున్న శాస్త్ర సాంకేతికత రంగాల ప్రతిఫలాల వెనక ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలు దాగి వున్నాయని పవన్ అన్నారు.జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తలు పనిచేసారు... అందువల్లే ఈ టెక్నాలజీ సాధ్యమయ్యిందన్నారు. అంతరిక్ష పరిశోదనల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ సగర్వంగా నిలబడిందంటే అందుకు ఎందరో మహానుభావులు కారణమన్నారు. తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని... అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణ ఫలితమే ప్రస్తుత ఇస్రో అని పవన్ కల్యాణ్ తెలిపారు. 

Pawan Kalyan

జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్    పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ఒక ఫార్ములా కనుక్కోవడానికి లేదా ఓ ప్రయోగం నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు చేసే మేధోమధనం చాలా విలువైనదన్నారు. ఆలోచనల్లో పడి వారు నిద్రాహారానికి కూడా ఒక్కోసారి దూరం అవుతారన్నారు. దేశానికి ఏదో ఒకటి చేయాలనే వారి తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవి... ఈ దేశం ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేదన్నారు. అలాంటి హీరోల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం వుందని పవన్ పేర్కొన్నారు. 
 

Pawan Kalyan

చిన్నచిన్న విషయాలకే తల్లడిల్లిపోయే నేటితరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తిప్రదాతలుగా మారి దారి చూపాలన్నారు. శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలి. వారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. వారి మాటలను వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం గొప్పగా మారుతుందన్నారు. బలంగా కోరుకుంటే మంచి తప్పకుండా జరుగుతుందన్నారు. 

Latest Videos

click me!