మీ పిల్లలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి పవన్ ... ఇస్రోతో కలిసి సూపర్ మిషన్!

First Published | Aug 13, 2024, 8:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త ఆలోచనను బైటపెట్టారు. రాష్ట్ర యువతకు శాస్త్ర సాంకేతిక విషయాల్లో మంచి పరిజ్ఞానం కల్పించి శాస్త్రవేత్తలుగా, మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా ఆయన ఆలోచన వుంది... అదేంటంటే..

Pawan Kalyan

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ యువతను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే భారత అంతరిక్ష  పరిశోధన కేంద్రం (ISRO) తో ఒప్పందానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ లో చర్చించి రాష్ట్ర యువతకు ఇస్రో సహకారం అందేలా చూస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 
 

Pawan Kalyan

జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్... శాస్త్రవేత్తలు, షార్ సిబ్బందితో పాటు చిన్నారులు, కళాశాల యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
 

Latest Videos


Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ యువతలో అపరిమితమైన జిజ్ఞాస ఉంది... దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుందన్నారు. సరైన దారి చూపేవారు లేకపోవడం వలనే యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారన్నారు. కాబట్టి రాష్ట్ర యువతకు దారిచూసే బాధ్యత ఇస్రో తీసుకోవాలన్నారు. యువతతో విజ్ఞానపరమైన విషయాలను పంచుకునేలా, విలువైన సూచనలు  అందించేలా ఇస్రోతో ఎంఓయూ కు ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు.
 

Pawan Kalyan

అంతరిక్ష రంగంలో మంచి అవకాశాలు వున్నాయి... కాబట్టి భావితరాలకు ఇటువైపు నడవాలని సూచించారు. అంతరిక్ష పరిశోదనలపై చిన్నప్పటినుండే ఆసక్తి ఏర్పర్చుకోవాలని సూచించారు. యువతకు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆకాంక్షకు తగినట్లుగా ఉపాధి మార్గం లేదంటే పరిశోధనల మార్గాన్ని ఇస్రో అధికారులు చూపాలన్నారు... తగిన గైడెన్స్ ఇస్తే యువత జీవితం మెరుగుపడటమే కాదు దేశానికి కూడా మంచి సేవలు అందుతాయన్నారు. గ్రామీణ, అర్భన్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా ప్రభుత్వం, ఇస్రో కలిసి ముందుకు వెళదాం... ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఎంఓయూ చేసుకుందామని పవన్  సూచించారు.  
 

Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇస్రో సంయుక్తంగా ముందుకు వెళ్లి యువతలో నైపుణ్యాన్ని వెలికితీద్దామని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేద్దామన్నారు. శాస్త్రవేత్తలే ఈ దేశానికి బలం... జాతి సంపద... వారు ఈ దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. భావి భారతం మరిన్ని ప్రయోగాలకు వేదిక కావాలని కోరుకుంటున్నానని...అందుకోసమే యువతను శాస్త్ర సాంకేతికత వైపు నడిపించాలని ప్రయత్నిస్తున్నానని పవన్ తెలిపారు.

click me!