Nadendla Manohar
100 రోజుల ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ బకాయిల్లో రూ. 10 వేల కోట్లు తిరిగి చెల్లించడంతో పాటు 10 వేల కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫెయిర్ ప్రైస్ షాపులు తీసుకువచ్చి బియ్యం, కందిపప్పుతోపాటు చక్కెర, ఫామ్ ఆయిల్ ఇతర నిత్యావసరాలు అందచేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో బియ్యం నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
Nadendla Manohar
ఇవాళ (సోమవారం) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను మంత్రి నాదెండ్ల విడుదల చేసారు. అమలాపురంలో జరిగిన ఈ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 10,450 మంది రైతుల ఖాతాల్లో రూ. 191.84 కోట్ల బకాయిలను జమచేసారు. ఇకపై ఇలా దాన్యం డబ్బుల కోసం రైతులు నెలలతరబడి ఎదురుచూడాల్సిన అవసరం వుండదని... కేవలం 48 గంటల్లో సొమ్ము అన్నదాత అకౌంట్లో పడేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Nadendla Manohar
కూటమి ప్రభుత్వం కేవలం పారిశ్రామివేత్తలకే కాదు రైతులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో రైతుల పాత్ర కూడా చాలా వుంటుంది... కాబట్టి వారికి ప్రతి అడుగులో ఎర్రతివాచీ వేస్తామన్నారు. రైతులు విత్తనాల కొనుగోలు చేసేటప్పటి నుండి ధాన్యం అమ్ముకునే వరకు ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది.. ఇందుకోసం సింగిల్ విండో తరహా విదానాన్ని అనుసరిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ రంగ పటిష్టతకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు.
Nadendla Manohar
ఎన్నికల వేళ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక తు.చ తప్పకుండా పాటిస్తున్నామని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో కోనసీమ గ్రామాల్లో పర్యటించి రైతుల దుస్థితి ప్రత్యక్షంగా తెలుసుకున్నామన్నారు. గ్రామాల్లో 80శాతానికి పైగా వున్న కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకున్నవారే లేకుండా పోయారన్నారు. కౌలు రైతుల కృషిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది... అందువల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేసారు.
Nadendla Manohar
కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత రైతు బకాయిల మీద సమీక్ష జరిపితే ఒక్క పౌరసరఫరాల శాఖ ద్వారానే రూ. 40 వేల కోట్ల రుణాలు సేకరించి ఇతర కార్యక్రమాలకు వాడేసిన విషయం బయటపడిందన్నారు. అందులో ఒక్క రూపాయి కూడా రైతు శ్రేయస్సు కోసమో, ధాన్యం కొనుగోళ్ల కోసమే వాడింది లేదన్నారు. వెళ్తూ వెళ్తూ రైతుల నుంచి ధాన్యం కొన్న బకాయిలు రూ.1674 కోట్లు వదిలేసిపోయారన్నారు. గత ప్రభుత్వం 84 వేల మంది రైతులకు ఇచ్చిన మాట తప్పిందని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ బకాయిలను నెల రోజులలోపు చెల్లించే ప్రయత్నం చేశామన్నారు. ఈ క్రమంలోనే జులై 4న వెయ్యి కోట్లు, ఈ రోజు మిగిలిన రూ. 674 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Nadendla Manohar
గత ప్రభుత్వంలో పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం దళారులను పెట్టి దోచుకుని ఓడల్లో విదేశాలకు ఎత్తుకుపోయి అమ్ముకున్నారని ఆరోపించారు. కాకినాడ పట్టణంలోని గోడౌన్లలో 52 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకుంటే అందులో 22 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం ఉందని గుర్తుచేసారు. కొంత మంది పెద్దలు పేదల పొట్టకొట్టి దోచుకున్న బియ్యం ఇది అని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.