వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటన: కళ్లు తెరిచే లోగానే... చుట్టేసిన విషవాయవు

First Published May 7, 2020, 2:49 PM IST

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది.   

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలైప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లోఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్లీకైదాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది.
undefined
గురువారం తెల్లవారు జామున పాలిమర్స్ కంపెనీ నుండిగ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ ఎనిమిది ప్రాంతాల్లో వ్యాపించగా... ఆర్ ఆర్ పురంపై తీవ్ర ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
undefined
ఇకపోతే పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు స్టైరిన్గ్యాస్ అని తెలుస్తోంది. ఈ వాయువు చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఈగ్యాస్ కేంద్ర నాడీ వ్యవస్థ, పనిచేస్తోందని, దాన్ని నిర్వీర్యం చేస్తుందనివైద్యులు చెప్తున్నారు.
undefined
ఈ విష వాయువు వెలువడ్డ ప్రాంతమంతా చూడడానికి హృదయ విదారకంగా ఉంది. ఆ గ్యాస్ పీల్చిన వెంటనే దగ్గరగా చుట్టుపక్కల ఉన్నవారుఅక్కడే కుప్పకూలిపోయారు. ఎక్కువ మోతాదులో ఈ వాయువును పీల్చినవారు, ఇతర అనారోగ్య సంబంధమైన అంశాలతోబాధపడుతున్నవారు కూడా తీవ్రఅస్వస్థతర్హాకు గురయ్యారు.
undefined
ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పారిపోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది మార్గ మధ్యంలోనే కుప్పకూలి పడిపోయారు. పశువులు ఈ విషవాయువు వల్ల ఉలుకు పలుకు లేకుండా కట్టేసినవి కట్టేసినచోటేకుప్పకూలిపోయాయి.
undefined
ఈ వాయువువల్ల, మహిళలు, చిన్న పిల్లలు వృద్ధులు అత్యధికంగా ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ లీకైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆస్పత్రికి లేదా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని లేకపోతే పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని డాక్టర్లు సూచించడంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలందరినీ అక్కడి నుండి తరలించింది.
undefined
తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు ఈ విషవాయువును పీల్చారు. దాంతో వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఎనిమిది మందిదుర్మరణం చెందగా పలువురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
undefined
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే వాకబు చేసారు. ఆయనకాసేపట్లో విశాఖకుప్రత్యేక విమానంలోచేరుకోనున్నారు. సహాయకచర్యల్ని పర్యవేక్షించడంతో పాటుగా,సీఎం జగన్ భాధితులను కూడా పరామర్శించనున్నారు.
undefined
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి ఈ విషయం తెలియగానేవిశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులతో సంప్రదించారు.తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలనుజారీచేశారు.
undefined
పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, నరవ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంచరపాలెం, కృష్ణానగర్ తదితర ప్రజలకు సాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలనిసూచించారు.
undefined
ఉన్నపలంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానిక ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని కలెక్టర్ కి సూచించారుమంత్రి గౌతమ్ రెడ్డి జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలెవన్ కు ఆదేశాలను జారీ చేసారు.
undefined
ఈ ఘటనతో ఒక్కసారిగా 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ముగ్గురి మృతి చెందారని.. సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలియవచ్చింది. పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలించారు.
undefined
click me!