Veligonda Project : ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఈయన పేరే ఎందుకు పెట్టారు?

Published : Aug 31, 2026, 04:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్’ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

PREV
15
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం

Poola Subbaiah : ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నేడు నెరవేరింది... కరవు నేలను కృష్ణా జలాలు తాకాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ 'పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 1' ను జాతికి అంకితం చేశారు. జంట టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్ కు చేరాయి... 53 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ఇప్పటికయితే 10 టిఎంసిల నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడి నుండి మూడు కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందించనున్నారు. ఈ వెలిగొండ ప్రాజెక్ట్ తో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది.

అయితే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టారు... ఈయన ఎవరు? ఈ ప్రాజెక్టుతో ఈయనకు సంబంధం ఏంటి? అనేది చాలామందికి తెలియదు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో పూల సుబ్బయ్య గురించి తెలుసుకుందాం.

25
ఎవరీ పూల సుబ్బయ్య?

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేనే ఈ పూల సుబ్బయ్య. ఈయన యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేశారు… సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సిపిఐ తరపున మొదటిసారి 1962 లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించారు... ఆ తర్వాత ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. 1967 లో రెండోసారి యర్రగొండపాలెం నుండి గెలిచారు. తర్వాత మార్కాపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

ఇలా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలోనే నిరంతరం కరవుకాటకాలతో సతమతం అవుతున్న తమ ప్రాంతానికి సాగునీరు అందించాలని పోరాటాలు చేశారు. కృష్ణా జలాలను తరలించి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని కలగన్నారు. ఇలా పూలసుబ్బయ్య పోరాట పలితమే నేటి వెలిగొండ ప్రాజెక్టు.

35
పూల సుబ్బయ్య వ్యక్తిగత జీవితం..

ఉమ్మడి ప్రకాశం జిల్లా కంభం గ్రామంలో వెంకటపతి, సుబ్బమ్మ దంపతులకు పూల సుబ్బయ్య జన్మించారు. బాల్యంలోనే తండ్రి మరణించడంతో తల్లి ఇతడిని కష్టపడి పెంచింది... ఆర్థిక కష్టాలు ఎదురైనప్పటికీ కొడుకును బాగా చదివించింది. ఇలా తల్లి ప్రోత్సాహంతో బాగా చదువుకున్నారు సుబ్బయ్య.. గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కాలేజీ నుండి డిగ్రీ పూర్తిచేశారు. ఇలా ఉన్నత చదువులు చదివిన ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు... తురమెళ్లలోని ఓ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలకు ప్రదానోపాధ్యాయుడిగా పనిచేశారు.

అయితే 1952 లో బెల్గాంలో లా చదివిన సుబ్బయ్య మార్కాపురంలో న్యాయవాదిగా స్థిరపడ్డారు. ఇదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది... విద్యార్థి ధశ నుండే రాజకీయాలపై ఆసక్తి కలిగిన ఆయన న్యాయవాదిగా మారినతర్వాత మరింత చురుగ్గా మారారు. కార్మిక సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు... ఇలా ప్రజలకు చాలా దగ్గరయ్యారు. అనంతరం సిపిఐ తరపున యర్రగొండపాలెం, మార్కాపురం అసెంబ్లీ నుండి పోటీచేసి గెలిచారు.

45
వెలిగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య పేరు పెట్టిందెవరు?

సాగు, తాగు నీటి సౌకర్యాలు లేక కరవు తాండవిస్తున్న ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు పూల సుబ్బయ్య పెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపారు. ఇతని కృషి ఫలితంగానే ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు భీజం పడింది. అయితే 1996 మార్చి 5న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. మళ్లి ఇప్పుడు ఆయనే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం విశేషం.

అయితే వెలిగొండ ప్రాజెక్టు కోసం అహర్నిశలు పాటుపడిన మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య పేరును పెట్టాలనే ప్రజల డిమాండ్ చేశారు. దీంతో తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి ''పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు'' అని నామకరణం చేశారు.

55
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఉపయోగాలు

యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు. నీళ్లలోకి దిగి కృష్ణమ్మకు హారతి ఇచ్చి పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. జలహారతి ఇచ్చే ప్రదేశం వద్ద గిరిజన మహిళలు, చిన్నారులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఇలా అట్టహాసంగా వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశను జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది.

ఈ వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. 4 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సుస్థిరం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories