తిరుమల: పట్టువస్త్రాలు ధరించి, నుదుటన తిలకం దిద్దుకుని అచ్చతెలుగు వేషధారణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలియుగదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో జరిగే దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి ఆంధ్ర ప్రదేశ్ కు చేరకున్నారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి నేరుగా తిరుమలకు చేరకున్న అమిత్ షాను సీఎం జగన్ దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు.