కుప్పంలో లోకేష్ ఇంటింటి ప్రచారం.. ‘చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వం ఇది’

First Published | Nov 12, 2021, 8:08 PM IST

టీడీపీ నేత నారా లోకేష్ కుప్పంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తామని, అన్నా క్యాంటీన్ మళ్లీ తెస్తామని, చెత్త మీద వైసీపీ ప్రభుత్వం వేసిన పన్ను ఎత్తేస్తామని అన్నారు. చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు.
 

nara lokesh

కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం పర్యటించారు. అక్కడ బీసీ కాలనీ, విజయలక్ష్మీ రోడ్డులో పాదయాత్ర చేశారు. ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ  సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం గడ్డ.. చంద్రబాబు నాయుడి అడ్డా అని అన్నారు. కుప్పంలో ప్రతి గడపకూ సహాయం అందించింది తామేనని, జగన్ రెడ్డి అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఒక్కసారైనా ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించారు. 

nara lokesh

కుప్పం దేవాలయం వంటిదని, కానీ, ఇప్పుడు ఇక్కడికి దొంగలు, రౌడీలు, ఎర్ర చందనం స్మగ్లర్లూ ప్రవేశించారని అన్నారు. కుప్పం ప్రజలను కొనడానికి వైసీపీ కుక్కలు వచ్చాయని, కానీ, అమ్ముడుపోవడానికి ఇది వైసీపీ చిల్లర బ్యాచ్ కాదని విమర్శలు చేశారు.


nara lokesh

తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పంకు రూ. 300 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశారని లోకేష్ అన్నారు. ఇక్కడే తిష్ట వేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి మూడు పైసలు కూడా కుప్పం కోసం  కేటాయించలేదని విమర్శించారు. గెలుపుపై నమ్మకం లేనివారే అడ్డమైన పనులు చేస్తారని విరుచుకుపడ్డారు. ప్రజా బలం లేదు కాబట్టే పోలీసు బలాన్ని, అధికార బలాన్ని నమ్ముకున్నాడని తెలిపారు.

nara lokesh

రాష్ట్రంలో అలసు ఎన్నికలే జరగడం లేదని, అంతా సెలక్షనే అని దుయ్యబట్టారు. ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులపై పోలీసుల బెదిరింపులు, అక్రమ అరెస్టులు, నామినేషన్ పత్రాలు చించేయడం, దొంగ సంతకాలతో నామినేషన్లను విత్ డ్రా చేయడం వంటి మూర్ఖపు పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.

nara lokesh

తాము గెలిస్తే.. పన్నులు తగ్గిస్తామని, అభివృద్ది చేపడుతామని, జగన్ రెడ్డి ఎత్తేసిన అన్నా క్యాంటీన్ తెరుస్తామని, చెత్తపై విధించిన పన్ను ఎత్తేస్తామని లోకేష్ వివరించారు. జగన్ రెడ్డి కటింగ్ మాస్టర్ అని, ఓటు వేయకపోతే పెన్షన్ కట్ చేస్తామని, రేషన్ కట్ చేస్తామని, సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారని అన్నారు.

nara lokesh

చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వాన్ని ఏం అనాలి? అందుకే జగన్ రెడ్డిది చెత్త ప్రభుత్వం అని అంటున్నారని విమర్శలు చేశారు.  కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు కొట్టేసే కన్నింగ్ మెంటాలిటీ జగన్ రెడ్డిది అని ఆరోపించారు.

nara lokesh

జగన్ రెడ్డి కేసులకు భయపడేది ఎవరూ లేరని, ఒక్క సంతకంతో మొత్తం కేసులు ఎత్తేస్తామని లోకేష్ అన్నారు. అక్రమ కేసులు పెడుతున్నవారికి, పెట్టిన వాళ్లకి చుక్కలు చూపిస్తామని చెప్పారు.

nara lokesh

వైసీపీ వాళ్లు ఫ్లూటు జింక ముందు ఊదాలని, సింహం ముందు కాదని ఎద్దేవా చేశారు. కష్టపడి పని చేస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి అండగా ఉంటామని తెలిపారు.

Latest Videos

click me!