Pawan Kalyan
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు మరికొన్ని నిధులు మంజూరు చేసింది. ఉపాధిహామీ పథకం కింద ఇటీవల భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరిన్ని నిధులను మంజూరు చేసింది. ఇలా కేంద్రం నుండి విడుదలైన ఉపాధి హామీ నిధులకు సంబంధించిన వివరాలను ఏపీ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివరించారు.
Pawan Kalyan
2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఉపాధి హామీ వేతనాల చెల్లింపుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిధులను కేటాయించిందని పవన్ తెలిపారు. ఇలా 21.5 కోట్ల పనిదినాలకు గాను మొత్తం రూ.5743.90 కోట్లను మంజూరు చేసారని మంత్రి తెలిపారు.
Pawan Kalyan
అయితే గతంలో ఆమోదించిన 15 కోట్ల పనిదినాలకు సంబంధించిన వేతనాల కోసం ఇప్పటికే రూ.2934.80 కోట్లను విడుదల చేసారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇప్పుడు మిగిలిన రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
Pawan Kalyan
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
Pawan Kalyan
ఇదిలావుంటే బడ్జెట్ లోనూ ఆంధ్ర ప్రదేశ్ కు భారీగా నిధలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏలో కీలక బాగస్వాములుగా వున్న టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది.
Pawan Kalyan
ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ పై ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తుంటారు. పవన్ కూడా ప్రధానిని ఎక్కడా తగ్గించకుండా చాలా గౌరవం ఇస్తారు.వీరిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఏపీకి నిధులు రాబట్టడంలో పనిచేస్తున్నాయని జనసేన నాయకులు అంటున్నారు. ఏదైమైనా పవన్ కు కేటాయించిన శాఖలకు కేంద్రం నుండే కాదు రాష్ట్రంనుండి బాగానే నిధులు వస్తున్నాయన్నది కాదనలేని నిజం. పవన్ కల్యాణ్ కూడా పాలనా అనుభవం లేకున్నా చాలా సమర్ధవంతంగా తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు చూసుకుంటున్నారు.