భలే పాయింట్ పట్టారు..! లోక్ సభలో జనసేన ఎంపీ బాలశౌరి అదరగొట్టారుగా..!!

First Published | Aug 9, 2024, 11:03 PM IST

అధికార పక్షంలో వుండికూడా కేంద్ర ప్రభుత్వ పథకంలో సమస్యలను గుర్తించి దాని పరిష్కార మార్గాన్ని కూడా వివరించారు జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఎక్కడో కాదు పార్లమెంట్ వేదికగానే ఈ పని చేసారాయన.. ఇంతకూ ఆయన దేనిగురించి మాట్లాడారంటే..

Vallabhaneni Balashowry

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వ పథకంపై లోక్ సభలో ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు. ఆయన ప్రశ్న సభలోని సభ్యులనే కాదు ప్రజలను కూడా ఆలోచింపజేసేలా వుంది. కేంద్ర ప్రభుత్వ పథకంపై  ఇంత క్షుణ్ణంగా ఆలోచించి సమస్యను గుర్తించిన జనసేన ఎంపీ బాలశౌరిని సహచర ఎంపీలతో పాటు సభలోనివారు అభినందించారు. 

Vallabhaneni Balashowry

బాలశౌరి ప్రశ్నేంటి ?  

 దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచన. అయితే ఇలా చేయడంవల్ల క్షేత్రస్థాయిలో ఏర్పడే సమస్యను గుర్తించిన మచిలీపట్నం ఎంపీ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 
 


Vallabhaneni Balashowry

దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ 78 శాతం పూర్తయితే కృష్ణా జిల్లాలో మాత్రం కేవలం 59 శాతమే పూర్తయ్యిందని ఎంపీ బాలశౌరి తెలియజేశారు. అంటే ఇప్పటివరకు తన సొంత జిల్లాలోని మొత్తం 3 లక్షల 75 వేల ఇళ్లకు గాను 2.2 లక్షల ఇళ్లకు మాత్రమే మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇంకా లక్షన్నరకు పైగా ఇళ్లకు మంచినీటి కుళాయి కనెక్షన్  ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఆ ఇళ్లకు కూడా జల్ జీవన్ మిషన్ కింద నళ్లా కనెక్షన్లు ఇవ్వాలని జనసేన ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

Vallabhaneni Balashowry

ఇక జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2024లో అంటే ఈ ఏడాదిలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది... కానీ ఈ లక్ష్యం ఎక్కడా నెరవేరలేదన్నారు. కాబట్టి మరిన్ని నిధులు సమకూర్చి కనీసం రాబోయే నాలుగైదేళ్లు కొనసాగించాలని సూచించారు. ఈ మిషన్ లక్ష్యాన్ని పూర్తిచేసి ప్రతి కుటుంబానికి ఒక కుళాయి ఏర్పాటు చేయాలని సూచించారు. తన  సొంత జిల్లా ప్రజల దాహర్తి తీర్చేలా ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని జనసేన ఎంపీ బాలశౌరి లోక్ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

Vallabhaneni Balashowry

ఇలా జల్ జీవన్ మిషన్ పథకంలో ఉన్న చిన్నచిన్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ బాలశౌరి. ఆయన సూచనలపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. 

Latest Videos

click me!