Union Budget 2025: బ‌డ్జెట్ 2025లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిర్మల‌మ్మ కేటాయింపులు ఇవే

Published : Feb 01, 2025, 05:23 PM IST

Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ‌నివారం పార్లమెంట్ లో బ‌డ్జెట్ 2025 ను ప్ర‌వేశ‌పెట్టారు. అయితే, కేంద్ర బ‌డ్జెట్ 2025-26 లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేటాయింపులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

PREV
15
Union Budget 2025: బ‌డ్జెట్ 2025లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిర్మల‌మ్మ కేటాయింపులు ఇవే
union budget

Budget 2025: భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టారు. లోక్ సభలో విపక్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య నిర్మ‌ల‌మ్మ 8వ సారి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు. విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య‌నే కేంద్ర‌ ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ 2025-26 ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

ప్రముఖ అభ్యుదయ తెలుగు కవి గురజాడ అప్పరావు చెప్పిన "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అంటూ నిర్మ‌ల‌మ్మ గుర్తు చేస్తూ బ‌డ్జెట్ అంశాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం భార‌త్ అధిక వృద్ధితో ముందుకు సాగుతున్న‌ద‌ని తెలిపారు.

25
union budget

కేంద్ర బ‌డ్జెట్ 2025-26:  నిర్మ‌లా సీతారామ‌న్ ఏం చెప్పారంటే?

బడ్జెట్ సందర్భంగా 2025-26 పద్దుకు సంబంధించి ఐదు లక్ష్యాలను నిర్మాలా సీతారామన్ ప్రస్తావించారు. ఇందులో వృద్ధిని పెంచడం, సమ్మిలిత ప్రగతి, ప్రయివేటు సెక్టారులో పెట్టుబడులు మరింతగా పెంచడం, హౌస్ హోల్డ్ సెంటిమెంట్ పెంచడం, దేశంలో మధ్య తరగతి వారి స్పెండింగ్ ను పెంచడం అంశాలు ఉన్నాయి. 

కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న సమయంలో పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రయాగ్ రాజ్ కుంభమేళా 2025లో చోటుచేసుకున్న తొక్కిసలాటపై చర్చకు డిమాండ్ చేశాయి. ఈ నిరసనల మధ్యనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగు ప్రముఖ అభ్యుదయ కవి గురజాడ అప్పరావు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.

35
Union Budget 2025: Analyzing Winners and Losers across key Sectors

కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేటాయింపులు ఇవే  

→ వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
→  వైజాగ్ పోర్టుకు రూ.730 కోట్లు
→  పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
→ పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్‌ గ్రాంటు రూ.12,157 కోట్లు
→ రోడ్లు, బ్రిడ్జ్ ల నిర్మాణానికి రూ.240 కోట్లు
→ ఇరిగేషన్‌, లైవ్లీ హుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు
→  ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు
→ జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు
→  లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆపరేషన్‌కు కోసం రూ.375 కోట్లు

45

కేంద్ర బడ్జెట్ 2025-26 పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే?  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. దీనిని "ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్" అని అభివర్ణిస్తూ, బడ్జెట్ సమాజంలోని అనేక వ‌ర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. 

"ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో విక్షిత్ భారత్ అనే దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది మహిళలు, పేదలు, యువత మరియు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది, అదే సమయంలో రాబోయే ఐదు సంవత్సరాలలో వృద్ధికి ఆరు కీలక రంగాలను కూడా గుర్తిస్తుంది" అని చంద్ర‌బాబు నాయుడు X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

మధ్యతరగతికి ఉపశమనం కల్పించడం, జాతీయ శ్రేయస్సు వైపు ఒక అడుగు అనే భావనను ప్రతిధ్వనిస్తూ, "బడ్జెట్ జాతీయ శ్రేయస్సు వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఇది సమగ్రమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది, ఇది మన దేశానికి సంపన్న భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది. అదనంగా, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతికి పన్ను ఉపశమనం తెస్తుంది. నేను ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాను" అని పేర్కొన్నారు. 

55


కేంద్ర బడ్జెట్ 2025-26 రూ. 50,65,345 కోట్ల 

కేంద్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులు: 

→ రక్షణ రూ. 4,91,732 కోట్లు

→ గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు

→ హోం రూ. 2,33,211 కోట్లు

→ వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు

→ విద్య రూ. 1,28,650 కోట్లు

→ ఆరోగ్య రూ. 98,311 కోట్లు

→ పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు

→ ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు

→ విద్యుత్‌ రూ. 81,174 కోట్లు

→ వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు

→ సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు

→ వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు

Read more Photos on
click me!

Recommended Stories