TTD: తిరుమల శ్రీవారిని నిజంగానే 15 నిమిషాలు దర్శించుకోవచ్చా.? ఇందులో నిజ‌మెంత

Published : Feb 28, 2026, 10:49 AM IST

TTD: తిరుమల శ్రీవారి సేవకు సంబంధించి ఇటీవల కొందరు సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు తిరుమలలో మొత్తం ఎన్ని రకాల దర్శనాలు ఉంటాయి.? ఏ ద‌ర్శ‌నానికి ఎంత సేపు ప‌డుతుంది.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
19
దర్శనం సమయంపై వివాదం

ఇటీవల తిరుమల దర్శనం సమయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు సెలబ్రిటీలు స్వామివారి ముందు 10 నుంచి 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నామని చెప్పడం వివాదానికి దారితీసింది.

నటి శివానీ నాగరం ఒక ఇంటర్వ్యూలో తాను 15 నిమిషాల పాటు స్వామిని దర్శించుకున్నానని చెప్పడంతో నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. సాధారణ భక్తులకు కొన్ని సెకన్లు కూడా దొరకని సమయంలో ఇంతసేపు దర్శనం ఎలా సాధ్యమైందని విమర్శలు వచ్చాయి.

దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు. శ్రీవాణి టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నామని తెలిపారు. క్యూలైన్‌లో స్వామి కనిపించే మొత్తం సమయాన్ని కలిపి 15 నిమిషాలుగా చెప్పానని వివరించారు. గర్భగుడి ముందు అంతసేపు నిలబడి ఉండలేదని చెప్పారు. ఇక మరోవైపు జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్ కూడా స్వామివారి ముందు ఎక్కువసేపు దర్శనం చేశానని చెప్పడంతో మరోసారి చర్చ మొదలైంది. సెలబ్రిటీలకు ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ భక్తులు మాత్రం గర్భగుడి ముందు కనీసం 5 నుంచి 10 సెకన్లైనా చూడనివ్వాలని కోరుతున్నారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంది. నిజంగానే 15 నిమిషాలు ద‌ర్శించుకునే సేవ‌లు ఏమైనా ఉన్నాయా.? ఇప్పుడు తెలుసుకుందాం.

29
శ్రీవారిని ద‌ర్శించుకునే మార్గాలు

టికెట్ లేకపోయినా దర్శనం – ఉచిత టోకెన్లు, ప్రత్యేక కోటాలు

అప్పటికప్పుడు తిరుమల వెళ్లాలనుకునేవారికి ఉచిత దర్శన టోకెన్లు ఒక మంచి అవకాశం. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో రోజూ ఈ టోకెన్లు ఇస్తారు. ఆధార్ కార్డు చూపించి భక్తులు టోకెన్ పొందవచ్చు. టోకెన్‌పై ఇచ్చిన సమయానికి తిరుమలకు చేరుకుంటే క్యూలో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.

కొంత‌మందికి ప్ర‌త్యేక సౌక‌ర్యాలు:

* ఏడాది లోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనం

* వృద్ధులు, దివ్యాంగులకు రోజుకు సుమారు 750 ఆన్‌లైన్ టికెట్లు

* అనారోగ్యంతో ఉన్నవారికి బయోమెట్రిక్ ద్వారా ప్రత్యేక ప్రవేశం

* భారత సైనికులకు రూ.300 ప్రత్యేక దర్శనం

* అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి రోజుకు ఐదుగురికి దర్శనం. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మార్గాలు.

39
ప్రత్యేక దర్శనాలు – సేవలు, హోమాలు, విదేశీ భక్తులకు అవకాశం

కొన్ని సేవల్లో పాల్గొంటే దర్శనం పొందే అవకాశం ఉంటుంది. అలిపిరి దగ్గర జరిగే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులు రూ.1600 చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. హోమం పూర్తయ్యాక ఇద్దరికి రూ.300 దర్శన టికెట్లు ఇస్తారు.

అలాగే విదేశాల్లో నివసించే భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంది. విదేశీ ప్రయాణం నెలలోపు ఉంటే పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ స్టాంప్ చూపించి దర్శనం టికెట్ పొందవచ్చు. ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

49
శ్రీవాణి దర్శనం, విరాళాలు, సిఫారసులతో దర్శనం

శ్రీవారి దర్శనానికి మరో ప్రముఖ మార్గం శ్రీవాణి ట్రస్ట్. ఈ ట్రస్ట్‌కు రూ.10,000 విరాళం ఇచ్చి, అదనంగా రూ.500 చెల్లిస్తే దర్శనం టికెట్ పొందవచ్చు. రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ టికెట్లు ఇస్తారు. తిరుపతి విమానాశ్రయం, తిరుమల శ్రీవాణి కేంద్రం, ఆన్‌లైన్ ద్వారా టికెట్లు లభిస్తాయి. శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేదా ఉన్నతాధికారుల సిఫారసులతో వీఐపీ దర్శనం కూడా పొందవచ్చు. రోజుకు వేల సంఖ్యలో ఈ టికెట్లు జారీ అవుతాయి. అయితే భారీ రద్దీ ఉన్న రోజులలో ఇవి నిలిపివేయవచ్చు. పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే దాతలకు కూడా ప్రత్యేక దర్శన అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకునే సౌకర్యం కల్పిస్తారు.

59
ప్రత్యేక వర్గాలకు దర్శనం – నవదంపతులు, యువత, భక్తి కార్యక్రమాలు

* తిరుమలలో వివాహం చేసుకున్న నవదంపతులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. వివాహ ధ్రువీకరణ పత్రం, ఫోటోలు చూపించాలి.

* యువతలో భక్తి భావం పెంచేందుకు గోవిందనామకోటి కార్యక్రమం ఉంది. 25 సంవత్సరాల లోపు యువకులు గోవింద నామం రాస్తే వీఐపీ దర్శనం అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా చాలా మందికి తెలియని మార్గాలు.

69
రూ. కోటి విరాళంతో రోజంతా

ఏడుకొండల వేంకటేశ్వరుడిని రోజంతా దర్శించుకునే అత్యంత ప్రత్యేక సేవ ఉదయాస్తమానసేవ (USSES). సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకూ జరిగే శ్రీవారి పూజలను ఒకే రోజు వీక్షించే అవకాశం ఇందులో ఉంటుంది. ఈ సేవను మొదట 1980లలో ప్రారంభించి, 2021లో మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.కోటి పైగా విరాళం ఇచ్చిన భక్తులకు ఈ టికెట్ ఇస్తారు.

సోమవారం నుంచి గురువారం వరకు ధర రూ.1 కోటి, శుక్రవారం రూ.1.5 కోట్లు. ఒక్క వ్యక్తి లేదా సంస్థ ఒక టికెట్ తీసుకోవచ్చు. టికెట్ పొందిన భక్తుడు ఏడాదికి ఒకసారి 25 సంవత్సరాలు లేదా జీవితాంతం స్వామిని దర్శించవచ్చు. భక్తుడితో పాటు ఆరుగురు కుటుంబసభ్యులకు అనుమతి ఉంటుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవల వంటి అనేక సేవలు దర్శించవచ్చు. స్వామి వస్త్రాలు, ప్రసాదాలు కూడా అందిస్తారు. తితిదే వెబ్‌సైట్‌లో ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులతో బుక్ చేసుకోవచ్చు.

79
ఏయే సేవ‌లు జ‌ర‌గుతాయంటే

సుప్రభాత సేవ: 'సుప్రభాతం' అనేది శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో తెల్లవారుజామున నిర్వ‌హించే మొదటి, ప్రధానమైన సేవ. వేద శ్లోకాల లయబద్ధమైన మంత్రోచ్ఛారణల మధ్య భగవంతుడిని తన స్వర్గపు నిద్ర నుంచి మేల్కొలపడానికి గర్భగుడిలోని శయన మండపం వద్ద ఈ ఆచారం నిర్వహిస్తారు. ఈ సేవ వ్యవధి దాదాపు 30 నిమిషాలు. స్వామి వారికి సుప్రభాత సేవను వారంలో ప్రతీ రోజు తెల్లవారుజామున 2:30 నుంచి 3:00 గంటల నడుమ నిర్వహిస్తారు.

అంగప్రదక్షిణ సేవ: అంగప్రదక్షిణం సేవ అంటే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి, ఆలయం లోపల ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణం చేసి, సుప్రభాతం తర్వాత తెల్లవారుజామున దర్శనం చేసుకుంటారు. ఈ సేవలో భాగంగా మీరు తెల్లవారుజామునే స్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఇతర సమయాల్లో కన్నా ఈ సమయంలో స్వామి వారి దర్శన భాగ్యం కాస్త ఎక్కువ సేపు లభించే అవకాశం ఉంటుంది.

89
విశేష, అష్ఠదళ, సహస్ర కలశాభిషేకం

విశేష పూజ: ఈ సేవను సోమవారాల్లో నిర్వహిస్తారు. ఇది స్వామికి సమర్పించే ప్రత్యేక పూజ. ఇది భగవంతునికి నిత్యం చేసే పూజల కంటే విపులమైన పూజ. ఈ సేవ వ్యవధి దాదాపు 30 నిమిషాలు ఉంటుంది.

అష్ఠదళ - పాద పద్మారాధన: ఈ సేవను మంగళవారాలలో నిర్వహిస్తారు. ఇది భగవంతుని పాదాలకు పుష్పాలను సమర్పించడం. పువ్వులు తామర పువ్వు రూపంలో స‌మ‌ర్పిస్తారు. ఇది చాలా అందమైన, ప్రశాంతమైన సేవ. ఈ సేవ వ్యవధి దాదాపు 15 నిమిషాలు.

సహస్ర కలశాభిషేకం: ఈ సేవను బుధవారం నాడు నిర్వహిస్తారు. ఇది స్వామికి వెయ్యి అభిషేకాలు (ఆచార స్నానం) నిర్వహించడం. అభిషేకాలను పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వంటి వివిధ పవిత్ర పదార్థాలతో నిర్వహిస్తారు. ఈ సేవ వ్యవధి దాదాపు 45 నిమిషాలు ఉంటుంది.

99
తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, అభిషేకం

తిరుప్పావడ సేవ: ఈ సేవను గురువారాల్లో నిర్వహిస్తారు. ఇది "తిరుప్పావాదం" అనే ప్రత్యేకమైన ఆహారాన్ని స్వామికి సమర్పించే ఆచారం. తిరుప్పావడాన్ని బియ్యం, నెయ్యి, పంచదార, గింజలతో తయారుచేస్తారు. ఇది చాలా రుచికరమైన, పౌష్టికాహారం, ఇది భగవంతుడికి చాలా ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. ఈ సేవ వ్యవధి దాదాపు 15 నిమిషాలు ఉంటుంది.

పూలంగి సేవ: ఈ సేవను గురువారాల్లో నిర్వహిస్తారు. ఇది "పూలంగి" అని పిలువబడే ప్రత్యేకమైన పువ్వును స్వామికి సమర్పించే ఆచారం. పూలంగి పువ్వు చాలా సువాసనగల పువ్వు అని, ఇది భగవంతుడికి చాలా ప్రీతికరమైనదని చెబుతారు. ఈ సేవ వ్యవధి దాదాపు 15 నిమిషాలు ఉంటుంది.

అభిషేకం: ఈ సేవను శుక్రవారాల్లో నిర్వహిస్తారు. ఇది స్వామికి అభిషేకాలు (ఆచార స్నానం) చేసే ఆచారం. అభిషేకాలను పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వంటి వివిధ పవిత్ర పదార్థాలతో నిర్వహిస్తారు. ఈ సేవ వ్యవధి దాదాపు 45 నిమిషాలు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories