Top 5 Richest Temples in AP : తిరుమల తర్వాత.. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 ఆలయాలేవి?

Published : Nov 28, 2026, 02:30 PM IST

ఇండియాలోనే రిచెస్ట్ టెంపుల్ గా తిరుమల తిరుపతి దేవస్థాయం గుర్తింపు పొందింది. మరి ఈ ఆలయం కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 ఆలయాలేవో తెలుసా?

PREV
15
ఏపీలో టాప్ 5 ధనిక ఆలయాలివే..

భారతదేశంలో టెంపుల్ స్టేట్ గా తమిళనాడుకు పేరుంది. అయితే దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలు అంటే రిచెస్ట్ టెంపుల్స్ కలిగిన రాష్ట్రం మాత్రం ఆంధ్ర ప్రదేశ్. ఏటా వేలకోట్ల ఆదాయం, లక్షల కోట్ల ఆస్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడే ఉంది. అయితే కేవలం తిరుమల మాత్రమే కాదు ఏపీలోని మరికొన్ని దేవాలయాలు కూడా వందల కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. అలాంటి టాప్ 5 దేవాలయాల గురించి తెలుసుకుందాం.

25
1. శ్రీశైలం ఆలయం

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో నల్లమల అడవుల్లో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం ఉంటుంది. నంద్యాల జిల్లాలోని ఈ ఆలయంలో లింగరూపంలో శివుడు పూజలు అందుకుంటాడు... దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. భ్రమరాంబిక అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఎంతో మహిమాన్విత శ్రీశైలం ఆలయాన్ని నిత్యం వేలాదిమంది సందర్శిస్తారు... శివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.

నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ శ్రీశైలం ఆలయ వార్షిక ఆదాయం రూ.200 కోట్లు దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ టెంపుల్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఆదాయం రూ.217 కోట్లు వచ్చింది. అలాగే ఆ ఆలయ మొత్తం ఆస్తులు రూ.2000 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఆదాయంపరంగానే కాదు ఆస్తుల పరంగా కూడా తిరుమల తర్వాత ఏపీలో రిచెస్ట్ టెంపుల్ శ్రీశైలమే.

35
2. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరం పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది ఈ కనకదుర్గమ్మ ఆలయమే. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు స్వయంభు గా వెలిశారని ఆలయ చరిత్ర చెబుతుంది. దీన్ని అధికారికంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అని పిలుస్తారు. విజయదశమి సమయంలో ఈ ఆలయంతో ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని తెలుగు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సందర్శిస్తుంటారు. హుండీతో పాటు ఇతర మార్గాల్లో ఈ ఆలయానికి ఆదాయం లభిస్తుంది. ఈ ఆలయ వార్షిక ఆదాయ రూ.120 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ దేవాలయ మొత్తం ఆస్తులు కూడా రూ.1500 కోట్లకు పైగా ఉంటాయి. తిరుమల, శ్రీశైలం తర్వత రిచెస్ట్ టెంపుల్ గా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం గుర్తింపు పొందింది.

45
3. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

ఉత్తరాంధ్రలోని ప్రముఖ నగరం విశాఖపట్నంకు సమీపంలో పురాతన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (సింహాద్రి అప్పన్న టెంపుల్) ఉంటుంది. తూర్పు కనుమలలోని ఎత్తైన కొండపై స్వామివారు వెలిశారు. ఎంతో విశిష్ఠత కలిగిన ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.

సింహాచలం ఆలయానికి ప్రతి ఏటా రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆలయాన్ని విజయనగర జమిందార్లు అంటే పూసపాటి వంశస్థులు ఆభరణాలు, భూములు ఇచ్చారు... ఇప్పటికీ ఈ వంశస్థులే ఆలయానికి వంశపారంపర ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ సింహాచలం మొత్తం ఆస్తుల విలువ 1200 కోట్లకు పైగా ఉంటుంది.

55
4. అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని మరో ప్రముఖ దేవాలయం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయం... కాకినాడ జిల్లాలోని పంపా నది ఒడ్డున ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు... ఇందుకోసం ప్రత్యేక వ్రత మండపాలు ఉన్నాయి. ఈ దేవాలయ వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. మొత్తం ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటాయట.

5. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం

తిరుపతి జిల్లాలో తిరుమల తర్వాత అంతటి విశిష్ఠత కలిగిన ఆలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం.... ఇక్కడ వాయు లింగం రూపంలో శివుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయం రాహు-కేతు పూజలకు ప్రసిద్ది... సర్ప దోష నివారణకు ఈ పూజలు చేస్తారు. ఆ ఆలయం కూడా రూ.100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం... భారీగానే ఆస్తులను కలిగి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories