Nara Lokesh
అమరావతి : ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో లోకేష్ ను సిఐడి విచారణకు పిలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ(మంగళవారం) లోకేష్ సిఐడి విచారణకు హాజరవుతుండటం ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ టెన్షన్ మొదలయ్యింది.
bhuvaneshwari
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో స్కాం జరిగిందని... ఇందులో ఆనాటి మంత్రి లోకేష్ పాత్ర వుందని సిఐడి ఆరోపిస్తోంది. తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు మరికొందరికి లాభం చేకూర్చేలా ఐఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చినట్లు సిఐడి చెబుతోంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిఐడి మాజీ మంత్రులు లోకేష్, నారాయణ లకు తమ ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసాయి.
Nara Lokesh
తండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత జాతీయ పార్టీల మద్దతు, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతూ లోకేష్ డిల్లీలోనే ఎక్కువగా వుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ సిఐడి విచారణకు హాజరుకావాల్సి వుండటంతో గత రాత్రి ప్రత్యేక విమానంలో ఆయన ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టిడిపి నేత యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడినుండి లోకేష్ నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
Nara lokesh
ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమరావతి ఐఆర్ఆర్ స్కాంపై లోకేష్ ను విచారించనున్నారు సిఐడి అధికారులు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం -2 ఆఫీస్ లో ఈ విచారణ జరగనుంది. ఈ విచారణ లోకేష్ లాయర్ కు కనిపించేలా సాగాలని... మధ్యలో గంటసేపు లంచ్ బ్రేక్ ఇవ్వాలని హైకోర్టు సిఐడికి సూచించింది.
lokesh
అమరావతి ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ను ఏ14గా పేర్కొన్న లోకేష్ ను ఈ నెల 4 న విచారించాలని సిఐడి భావించింది. అందుకోసం డిల్లీకి వెళ్లిమరీ లోకేష్ కు నోటీసులు అందించారు సిఐడి అధికారులు. అయితే సిఐడి నోటీసుల్లో పేర్కొన్న అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ నెల 10న అంటే ఇవాళ లోకేష్ ను విచారించాల్సిందిగా న్యాయస్థానం సిఐడిని ఆదేశించింది.