చంద్రబాబు అరెస్ట్ .. ‘ కాంతితో క్రాంతి ’ నిరసనలో పాల్గొన్న నారా భువనేశ్వరి (ఫోటోలు)

Siva Kodati |  
Published : Oct 07, 2023, 09:48 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్నినిర్వహించాయి. రాజమండ్రిలో జరిగిన నిరసన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేష్ తదితర నేతలు పాల్గొన్నారు.   

PREV
15
చంద్రబాబు అరెస్ట్ .. ‘ కాంతితో క్రాంతి ’ నిరసనలో పాల్గొన్న నారా భువనేశ్వరి (ఫోటోలు)
nara bhuvaneswari

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఇప్పటికే మోత మోగిద్దాం నిర్వహించగా.. అదే తరహాలో కాంతితో క్రాంతి నిర్వహించింది. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు లైట్లు ఆపేసి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. 

25
nara bhuvaneswari

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీపాలు వెలిగించి చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు. 

35
nara bhuvaneswari

ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసం వద్ద నిర్వహించిన నిరసనలో లోకేష్‌తో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

45
nara bhuvaneswari

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లతో వెలుగులు ప్రదర్శించి సామూహిక నిరసన తెలిపారు. 

55
nara bhuvaneswari

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్నారు. బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

Read more Photos on
click me!