అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన జనసేనాని అక్కడే టిడిపి-జనసేన పొత్తుపై కీలక ప్రకటన చేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి,జనసేన కలిసే పోటీచేయనున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుపార్టీల లీడర్లు, క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లేందుకు సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. ఇప్పటికే టిడిపి, జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు... రేపో, ఎల్లుండో ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.