Tirupati: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్

Published : May 13, 2025, 07:59 PM IST

Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది.   

PREV
16
Tirupati:  తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్

Tirumala Tirupati Devasthanam (TTD): తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధుల వీఐపీ బ్రేక్ దర్శన సిఫార్సులను తిరిగి స్వీకరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎండోమెంట్స్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  మీడియా ద్వారా సమాచారం అందించారు.

26
Tirumala

అత్యవసర దర్శనం అవకాశంగా పరిగణించే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ మే 15వ తేదీ నుంచి స్వీకరిస్తుంది. ఈ సిఫార్సులతో వచ్చే భక్తులకు మే 16వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించనున్నార‌ని తెలిపారు.

36

గతంలో వేసవి సెలవుల నేపథ్యంలో మే 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో ప్రోటోకాల్ వీఐపీ లకు మాత్రమే దర్శన అనుమతి ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ బోర్డు తాజా సమీక్షలో భాగంగా మే 15 నుంచి ప్రజాప్రతినిధుల లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాలను మళ్లీ ప్రారంభించనుంది.

46

అయితే, టీటీడీ అధికారులు స్పష్టం చేసిన విషయం ఏమంటే.. ఇతర అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. వీఐపీ దర్శనానికి సంబంధించిన కోటా పరిమితి, టైమ్ స్లాట్‌లు, గుర్తింపు ధ్రువీకరణలు వంటి అంశాల్లో ఎటువంటి మార్పులు లేవు.

56

భక్తులు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బ్రేక్ దర్శనానికి వచ్చేటప్పుడు, ఉన్నతాధికారుల నుండి వచ్చిన లేఖ, భద్రతా ప్రమాణాలతో కూడిన గుర్తింపు కార్డు వంటివి తప్పనిసరిగా తీసుకురావలసి ఉంటుంది.

 

66

ఈ మార్పుతో తిరుమలలో వచ్చే వారాల వ్యవధిలో వీఐపీ బ్రేక్ దర్శనానికి భారీగా అభ్యర్థనలు వస్తాయని అంచనా వేస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories