తిరుమలపై కరోనా ఎఫెక్ట్: తగ్గిన భక్తులు, ఆదాయం

First Published | May 13, 2021, 12:36 PM IST

ఆపద మొక్కులవాడికే ఆదాయం తగ్గిపోయింది. కరోనా కారణంగా భక్తుల సంఖ్య కూడ పడిపోయింది. కోవిడ్ భయంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 

కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో పాటు కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తక్కువగా వస్తున్నారు.
గత 12 రోజుల్లో తిరుమల వెంకన్నను 71,005 మంది భక్తులు దర్శించుకొన్నారు. మరోవైపు ఈ 12 రోజుల్లో టీటీడీకి రూ. 4.53 కోట్ల ఆదాయం వచ్చింది. కేవలం 3 లక్షల లడ్డూలు మాత్రమే విక్రయించారు.

కరోనా ప్రభావం కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో శ్రీవారి ఆదాయం కూడ తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది హుండీ ద్వారా రూ. 1131 కోట్ల ఆదాయం వస్తోందని టీటీడీ అంచనా వేసింది. అయితే కరోనా కారణంగా టీటీడీ అంచనాలను చేరుకొనే అవకాశం లేదు.
2020 మార్చికి ముందు (మార్చి 23వ తేదీన తిరుమల ఆలయం మూసివేశారు) ప్రతి రోజూ తిరుమల వెంకన్న ఆలయంలో దర్శనం కోసం కనీసం లక్ష మంది భక్తులు వచ్చేవారు. తక్కువలో తక్కువగా కనీసం 60 నుండి 75 వేల మంది భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేవారు.
కరోనా తర్వాత ఆలయానికి భక్తులు వచ్చే సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే కరోనా వ్యాక్సిన్ రావడంతో కొంత కాలంగా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గినా కూడ తిరుమల ఆదాయం పెరిగింది. అయితే కరోనా కేసుల వ్యాప్తి తిరిగి పెరుగుతుండడంతో మళ్లీ భక్తుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
2020 మార్చిలో కరోనా ప్రారంభం కాకముందు ప్రతి రోజూ కనీసం లక్ష మంది భక్తులు దర్శించుకొనేవారు. అంతేకాదు ప్రతి రోజూ హుండీ ద్వారా రూ. 2.5 కోట్ల నుండి రూ. 4 కోట్ల ఆదాయం వచ్చేది.
2021 ఫిబ్రవరి మాసంలో రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చిది. సాధారణంగా రోజూ 50 వేలు భక్తులు దర్శించుకొంటున్నారు. 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరిలో వరుసగా 19.93 లక్షలు, 21.68 లక్షలు భక్తులు దర్శించుకొన్నారు. హుండీ ఆదాయం రూ. 83.44 కోట్లు, రూ. 89.07 కోట్లుగా రికార్డులు చెబుతున్నాయి.
2021 ఫిబ్రవరిలో 14.41 లక్షల మంది భక్తులు దర్శించుకొన్నారు. తక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకొన్నా హుండీ ఆదాయం పెరిగింది. రూ. 90.45 కోట్లు. 2019 2020 తో పోలిస్తే 1.5 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా రెండు మాసాలుగా ఆదాయంతో పాటు భక్తుల సంఖ్య తగ్గుతోంది.

Latest Videos

click me!