సబ్బంహరి మృతి నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది.. చంద్రబాబు నాయుడు

First Published | May 3, 2021, 5:47 PM IST

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, తెలుగుదేశం పార్టీ మంచి నాయకుణ్ణి కోల్పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, తెలుగుదేశం పార్టీ మంచి నాయకుణ్ణి కోల్పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ఆశించాను. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది. సబ్బంహరి మృతి పార్టీకి తీరని లోటు. ప్రజా సమస్యలపై స్పందించడంలో హరి ఎప్పుడూ ముందుండేవారు. విశాఖ మేయర్ గా, లోక్ సభ సభ్యులుగా సబ్బంహరి ప్రజలకు ఎనలేని సేవ చేశారు.సబ్బంహరి మంచి వక్త. సమకాలీన రాజకీయాలపై సబ్బంహరికి మంచి పట్టుంది. ఏ అంశంమైనా లోతైన విశ్లేషణ చేసేవారు. సబ్బంహరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. హరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

తెలుగుదేశం సీనియర్ నాయకులు సబ్బం హరి గారు ఇక లేరన్న వార్తనుజీర్ణించుకోలేకపోతున్నానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన నిస్వార్థరాజకీయాలతో మాలాంటివారికి మార్గదర్శకులుగా నిలిచారు సబ్బం హరిగారు. ఆయన లాంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీకితీరని లోటు.ఏ విషయం పై అయినా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సబ్బం హరి గారు, ప్రజాసమస్యలపైరాజీలేని పోరాటం చేసారు. సబ్బం హరి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతినితెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి మృతి పట్ల టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి ఆయన మృతిచెందడం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా ఆశించామని, ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు.విశాఖ మేయర్, ఎంపీగా ఆయన ప్రజలకు విశేషమైన సేవలు అందించారని, సమస్యలపై పోరాడి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
సమకాలినా రాజకీయ విశ్లేషణలో సబ్భం హరి ఒక డిక్షనరీ లాంటివాడని తెలుగుదేశం పార్టీ ఏపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. తన రాజకీయ పరిజ్జానం తో రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పుడూ కాపాడాలనుకునేవాడు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు.సబ్బం హరి మరణం విశాఖ ఉక్కు ఉద్యమం కు సైతం తీరని లోటు. ఉత్తరాంధ్ర నుండి వచ్చి కేంద్ర స్థాయిలో తెలుగువారి సమస్యలపై పోరాడి నాయకుడు. ప్రజల కోసం నినదించే గళం ఇక లేదంటే నమ్మలేకున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంభ సభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు.
విశాఖ మాజీ మేయర్ గా ఆయన మాలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలిచారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ పంచుమర్తి అనూరాధ విచారం వ్యక్తం చేశారు.మాజీ లోక్ సభ సభ్యలు సబ్బం హరి మరణం భాధాకరం. ఆయన మృతి ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖా ప్రజలకు తీరని లోటు. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుడు, విశ్లేషకుడిని కోల్సోయిందన్నారు.విశాఖ మాజీ మేయర్ గా ఆయన మాలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఆయన తన భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచేవారు. ఆయన లేని లోటు పార్టీకి తీర్చలేనిది. సబ్బం హరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కటుంభ సభ్యులకు, ఆ దేవుడు మనో ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Latest Videos

click me!