ఆపరేషన్ ఆకర్ష్ భయం: జగన్ ప్లాన్‌తో ఆత్మరక్షణలో బాబు

First Published Jun 10, 2020, 11:38 AM IST

ఏపీ రాజకీయాల్లో మరో సారి ఆపరేషన్ ఆకర్ష్ అంశం తెరమీదికి వచ్చింది. టీడీపీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. అ ప్రచారాన్ని టీడీపీ నాయకత్వం మాత్రం ఖండిస్తోంది. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలతో వైసీపీ సంప్రదింపులు జరుపుతోందని మరోసారి ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి చెందిన కీలక నేతలను కూడ పార్టీలో చేర్చుకొనేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందనే ప్రచారం టీడీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందేఅసెంబ్లీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కోల్పోయేలా ప్లాన్ చేసినట్టుగా ప్రచారం కూడ సాగుతోంది.
undefined
గత ఏడాది మే మాసంలో జరిగిన ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు. వీరిలో కొందరిని తన మంత్రివర్గంలో కూడ స్థానం కల్పించారు చంద్రబాబు.
undefined
చంద్రబాబునాయుడు చేసినట్టుగా తాము ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేయమని సీఎం జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరాలనుకొనేవారు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరాలని జగన్ షరతు విధించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా కూడ జగన్ తేల్చి చెప్పారు.
undefined
అయితే పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్టుగా కన్పిస్తోంది. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ప్రకటించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీకి మద్దతు ప్రకటించారు. టీడీపీ ఆయనపై సస్పెన్షన్ విధించింది.
undefined
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడ టీడీపీని వీడారు. వైసీపీకి ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవలనే ప్రకాశం జిల్లాలోని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడ వైసీపీకి మద్దతు పలికారు.
undefined
గత నెల చివర్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు వైసీపీ తీర్ధం పుచ్చుకొంటారని ప్రచారం సాగింది.ఈ ప్రచారాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు ఖండించారు.
undefined
మరోవైపు టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడ వైసీపీకి జై కొట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, కడప జిల్లాకు చెందిన శివనాథ్ రెడ్డిలు వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడ వైసీపీలో చేరారు.
undefined
ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే టీడీపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ నాయకత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు.
undefined
మరో వైపు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీ లేదా బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వైసీపీలో కొందరు నేతలు గంటా శ్రీనివాసరావు చేరికను వ్యతిరేకిస్తున్నారని ప్రచారం ఉంది. గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
undefined
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ వల విసిరేందుకు చర్చలు జరిపినట్టుగా కూడ ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు పార్టీ నేతలు కూడ టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందంటున్నారు.
undefined
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కూడ టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. తనయుడితో కలిసి సిద్దా రాఘవరావు వైసీపీలో చేరే అవకాశం ఉంది.
undefined
టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంతో పార్టీ క్యాడర్ కొంత ఆందోళనకు గురౌతోంది. టీడీపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది.పార్టీని వీడిన వారంతా ద్రోహులు అంటూ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో వ్యాఖ్యానించారు.
undefined
click me!