Tirumala: ప‌ర్యాట‌కులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల నుండి నాలుగు కొత్త బస్సు ప్యాకేజీలు

Published : Feb 08, 2025, 08:04 AM ISTUpdated : Feb 08, 2025, 08:38 AM IST

Tirumala: త‌క్కువ ఖ‌ర్చుతోనే  పర్యాటకులు తిరుపతితో పాటు కాణిపాకం, కోయంబత్తూర్, మైసూర్, రామేశ్వరం, మధురై, ఊటీ, కన్యాకుమారి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ లను సందర్శించవచ్చు. దీని కోసం తిరుమ‌ల నుంచి ఏపీటీడీసీ నాలుగు ప్ర‌త్యేక బ‌స్సు  స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. 

PREV
16
Tirumala: ప‌ర్యాట‌కులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల నుండి నాలుగు కొత్త బస్సు ప్యాకేజీలు

Tirumala: ప‌ర్యాట‌కులకు కోసం తిరుప‌తి నుంచి నాలుగు కొత్త బ‌స్సు సర్వీసు ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. అధికారులు. ప్ర‌త్యేక‌ బస్సు ప్యాకేజీల ద్వారా తిరుమల తిరుప‌తి వెంక‌న్న‌ దర్శన టిక్కెట్లు ర‌ద్దు నేప‌థ్యంలో ఆర్థికంగా వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ ర‌క‌మైన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది.

ఏపీటీడీసీకి చెందిన బస్సులను ఇతర మార్గాల్లో వినియోగించుకునేలా ప్ర‌త్యేక ప్రణాళికలు చేస్తోంది. దీని  ద్వారా ఆర్థికంగా వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను తీర్చుకోవ‌డంతో పాటు తిరుమ‌ల సహా ఇతర దేవాలయాల ప‌ర్యాట‌కాన్ని మ‌రింత‌గా ముందుకు తీసుకెళ్లే  మ‌రిన్ని ప్ర‌యత్నాలు చేస్తోంది. తక్కువ ఖర్చులోనే ప్రయాణికులకు మంచి పర్యాటక అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. 

26
tirupathi

ప‌ర్యాట‌కుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మ‌రో ముంద‌డుగు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) పర్యాటకుల కోసం మ‌రో ముందడుగు వేస్తూ తిరుపతి నుండి నాలుగు కొత్త బస్సు స‌ర్వీసు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలను ఉపయోగించడం ద్వారా పర్యాటకులు కాణిపాకం, కోయంబత్తూర్, మైసూర్, రామేశ్వరం, మధురై, ఊటీ, కన్యాకుమారి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ లను సందర్శించవచ్చు. ప్యాకేజీలలో ఆహారం, వసతిని కూడా క‌ల్పించ‌నున్నారు. 

36

శ్రీవారి ద‌ర్శ‌నం కోసం మాత్ర‌మే 

గతంలో బస్సు ప్యాకేజీలు తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాత్రమే ఉండేవి, కానీ టిక్కెట్ల రద్దు కారణంగా పర్యాటక శాఖ నష్టాలను ఎదుర్కొంటున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఆలోచ‌న‌లు చేసిన సంస్థ నష్టాలను తొల‌గించుకోవ‌డానికి ఏపీటీడీసీ కొత్త మార్గాల కోసం నాలుగు బస్సు ప్యాకేజీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా ప‌ర్యాట‌కుల కోసం మంచి అనుభూతిని కూడా పంచున్నారు. 

46

తిరుమ‌ల నుంచి ప్రత్యేక బస్సు ప్యాకేజీల వివ‌రాలు ఇలా ఉన్నాయి:

తిరుపతి - కోయంబత్తూర్: నాలుగు రోజుల పర్యటన ఉంటుంది. ప్రతి బుధవారం తిరుపతి నుండి కోయంబత్తూర్ కు బస్సు స‌ర్వీసు నడుస్తుంది. 
తిరుపతి - మైసూర్: నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న ఉంటుంది. ఇక్కడ బస్సు ప్రతి బుధవారం తిరుపతి నుండి మైసూర్‌కు నడుస్తుంది. 
తిరుపతి - మధురై: నాలుగు రోజుల పర్యటన ఉంటుంది. ప్ర‌తి గురువారం ఉండే ఈ స‌ర్వీసులో బస్సు తిరుపతి నుండి కన్యాకుమారి మీదుగా మధురైకి నడుస్తుంది.
తిరుపతి - కాణిపాకం, స్వర్ణ దేవాలయం, అరుణాచలం: తిరుపతి నుండి కాణిపాకం, స్వర్ణ దేవాలయం, అరుణాచలం లకు రోజువారీ బస్సు సర్వీసు ఉంటుందని రాష్ట్ర  ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ తెలిపింది. 

56

మ‌ల్టీ యాక్సిల్ ఏసీ వోల్వో బ‌స్సులు 

ఏపీటీడీసీ ప్రారంభించిన కొత్త నాలుగు స‌ర్వీసుల కోసం మ‌ల్టీ యాక్సిల్ ఏసీ వోల్వో బ‌స్సులు ఉప‌యోగించ‌నున్నారు. 40 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం కలిగిన మల్టీ-యాక్సిల్ AC వోల్వో బస్సులను దీని కోసం అందుబాటులోకి ఉంచిన‌ట్టు సంబంధిత అధికారులు తెలిపారు. 

66

టిక్కెట్లు ఎలా బుడ్ చేసుకోవాలి? 

ఏపీటీడీసీ ప్రారంభించిన కొత్త బ‌స్సు స‌ర్వీసుల కోసం ప‌ర్యాట‌కులు ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకునే స‌దుపాయం తీసుకువ‌చ్చారు. APTDC వెబ్‌సైట్ ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సంబంధిత ఏవైనా ప్రశ్నలు లేదా ఇతర వివరాలు తెలుసుకోవ‌డం కోసం 9848007024, 9848850099, 9848973985 ఫోన్ నంబర్లను సంప్ర‌దించ‌వ‌చ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories