హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

First Published Feb 13, 2024, 10:10 AM IST

రాష్ట్ర విభజన సమయంలో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి హైద్రాబాద్ ను  పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే  ఉమ్మడి రాజధాని గడువును పెంచాలని  వైఎస్ఆర్‌సీపీ కోరుతుంది.

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా  విభజించింది కేంద్ర ప్రభుత్వం.  ఈ రాష్ట్రాల విభజన సమయంలో  హైద్రాబాద్ ను పదేళ్ల పాటు  ఉమ్మడి రాజధానిగా  ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.  2014 జూన్  2వ తేదీన  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగింది.   రాష్ట్ర విభజన జరిగి  ఈ ఏడాది జూన్ వస్తే  పదేళ్లు పూర్తవుతుంది.  దీంతో  ఉమ్మడి రాజధాని గడువు కూడ ముగియనుంది.  

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.  తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో అమరావతిని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  రాజధానిగా  ప్రకటించింది. అమరావతిలో  రాజధాని పనులకు  శంకుస్థాపన చేసింది అప్పటి ప్రభుత్వం

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

అయితే  2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది.  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. 

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

అమరావతిని శాసన రాజధానిగా , విశాఖపట్టణాన్ని  పరిపాలన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్టణం నుండి పాలన సాగిస్తామని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గతంలో పలు మార్లు ప్రకటించారు.

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

 అయితే  అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్ తో  అమరావతి  జేఏసీ ఆధ్వర్యంలో  ఆందోళనలు కూడ సాగుతున్నాయి.అమరావతి జేఏసీ ప్రతినిధులు ఈ విషయమై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై కోర్టులో విచారణ సాగుతుంది.   న్యాయపరమైన చిక్కులు తొలగితే  విశాఖపట్టణం నుండి రాజధానిని కొనసాగించాలని  అధికార వైఎస్ఆర్‌సీపీ భావిస్తుంది.  

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

ఉమ్మడి రాజధాని గడువును పొడిగించాలని కోరుతున్నారు.  విశాఖపట్టణంలో  రాజధాని  ఏర్పాటు చేసే వరకు  హైద్రాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు.ఈ విషయమై  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తం చేశారు. మీడియాతో ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

రాష్ట్ర విభజన చట్టం మేరకు పదేళ్లు హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది.  ఈ గడువును  పెంచాలని వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ తెరమీదికి తేవడంతో  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్  ఈ డిమాండ్ పై ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

రాష్ట్ర విభజన జరిగినప్పటికీ  రెండు రాష్ట్రాల మధ్య  ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యలను పరిష్కరించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు  కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే  ఈ విషయమై  కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తరచుగా చర్చలు జరుపుతుంది. 

హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంతో  గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కు మంచి సంబంధాలుండేవి. ప్రస్తుతం తెలంగాణలో  బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ పై కాంగ్రెస్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

click me!