దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు - మీరు అర్హులేనా?

First Published | Oct 24, 2024, 12:13 AM IST

Three free gas cylinders from Diwali : అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామ‌నీ, గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీపావ‌ళి నుంచి ఈ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపింది. 
 

free gas cylinders , Chandrababu Naidu, Andhra Pradesh, LPG gas

Three free gas cylinders from Diwali : దీపావ‌ళి కానుక‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉచిత మూడు గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఇ-క్యాబినెట్ సమావేశంలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి,   రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ఘనులు &  ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం & విప్తతుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా  మీడియాకు వివరించారు. 

free gas cylinders , Chandrababu Naidu, Andhra Pradesh, LPG gas

దీపావ‌ళి నుంచి ఉచిత సిలిండ‌ర్ల ప‌థ‌కం 

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకు అనుగుణంగా సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31 న దీపావళి పండుగ నుండి  మూడు సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తామ‌ని తెలిపారు. "ఆరోజే  సిలిండర్లను డెలివరీ చేస్తాం. ఇందుకై మూడు రోజుల ముందు నుండే  సిలిండర్ల  బుకింగ్ ప్రక్రియను ప్రారంబించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని" చెప్పారు.


free gas cylinders , Chandrababu Naidu, Andhra Pradesh, LPG gas

ఉచిత సిలిండర్ల పథకం కోసం ఏటా రూ.2,684 కోట్ల ఖర్చు 

ఈ పథకం అమలుకై ప్రతి ఏటా రూ.2,684 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఇందుకై మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గ్యాస్ సిలిండర్  ధర రూ.894.92 లనీ, ఈ మొత్తం సొమ్ము  రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలు అన్నింటికీ అందిస్తామన్నారు. ఈ రాయితీ సొమ్మును  డీబీబీ ద్వారా  లబ్దిదారుల ఖాతాలో  నేరుగా జమ చేస్తామని తెలిపారు.

డెలివరీ అయిన 48  గంటల్లోపే లబ్దిదారుల ఖాతాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. మూడు బ్లాక్ పిరియడ్లలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందనీ, ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుండి నవంబరు, డిశంబరు నుండి మార్చి మూడు బ్లాకుల్లో ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పారు. 

free gas cylinders , Chandrababu Naidu, Andhra Pradesh, LPG gas

ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ  ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం,  ఈ కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ పథకం అమల్లో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి తక్షణ పరిష్కారానికి గ్రీవెన్సు రిడ్రెసల్ సిస్టమ్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నాదేండ్ల తెలిపారు. 

ఉచిత సిలిండర్లతో దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చింది 

రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చిందా అనే విధంగా  మూడు సిలిండర్లు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కోసం నాడు కార్యక్రమం చేపట్టాం. మేం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలోపెట్టుకునే చేశాం. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం పై హామీ ఇచ్చామని చెప్పారు. 

అలాగే, "ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించి పేద ప్రజల ఇళ్లల్లో దీపావళికి వెలుగులు నింపబోతున్నాం. అక్టోబర్ 31 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ప్రతి మహిళా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. వంటింటిపై భారం తగ్గించడంలో ఇదోపెద్ద ముందడుగు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన లబ్దిదారులకు 24 గంటల వ్యవధిలో సబ్సిడీ మొత్తం జమచేస్తాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 గా ఉంది. ఏడాదికి ఉచితంగా మూడు అంటే రూ.2684 మేర మీకు లబ్ది జరుగుతుంది. దీని కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందని మంత్రి అనితా చెప్పారు. 

free gas cylinders , Chandrababu Naidu, Andhra Pradesh, LPG gas

వంట గ్యాస్ కోసం పెట్టే ఖర్చును మహిళలు ఇక తమ అవసరాలకు వాడుకోవచ్చనీ, ఇలాంటి పథకాలు పేదల జీవన ప్రామాణాలు పెంచడంలో భాగం అవుతాని చెప్పారు. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. "మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు నుంచి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల వరకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. నేడు మూడు పార్టీల కూటమి లో సైతం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశాం. మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి" ఉందన్నారు.

రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలను ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం.. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండటంతో పాటుగా అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అందించనున్నారు. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులుగా ఉంటారు. గ్యాస్ సిలిండర్ ను గృహ వినియోగం కోసమే వాడాలి.

Latest Videos

click me!