AP Extends School Holidays Due to Heavy Rains
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత ఆదివారం మొదలైన వర్షాలు సోమవారం మరింత ఊపందుకున్నాయి. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విశాఖ, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఈ రెండురోజులు సెలవులు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురియగా మంగళవారం అంటే ఇవాళ రాజధాని హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, ముగులు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. పలుచోట్లు భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా కురవొచ్చు... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
ఇక బుధవారం కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, వరంగల్,హన్మకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ తో పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురుస్తాయని ప్రకటించారు.