తిరుపతి ఎన్నికలో వైఎస్ వివేకా హత్య ఓ అస్త్రం: వైసీపీ, టీడీపీల దండయాత్ర

First Published Apr 14, 2021, 1:02 PM IST

తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ సర్శశక్తుల్ని ఒడ్డుతున్నాయి. 

తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తిరుపతి ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి ఉపయోగిస్తోంది. ఓటమి భయంతోనే టీడీపీ ఈ ప్రచారం చేస్తోందని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.
undefined
గత ఏడాది అనారోగ్యంతో ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించాడు. దీంతో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నెల 17వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
undefined
ఈ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం ద్వారా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
ఎన్నికల ప్రచారానికి రేపు ఒక్క రోజే ఉంది. దీంతో ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కరోనా కారణంగా ఈ నియోజకవర్గంలో ప్రచార సభల్లో పాల్గొనాలనే నిర్ణయాన్ని సీఎం జగన్ వాయిదా వేసుకొన్నారు.
undefined
ఈ నియోజకవర్గంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌తో పాటు పలువురు నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
undefined
ఈ నెల 12వ తేదీన తిరుపతిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబబాబు సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలైనట్టుగా టీడీపీ నేతలు తెలిపారు. ఈ రాళ్ల దాడిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు , టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు.
undefined
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రంగా మారింది. ఈ ఎన్నికల ప్రచాచం సాగుతున్న తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీలో సీబీఐ నేతలను కలిసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.
undefined
వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. మరోవైపు ఇదే అంశంపై జగన్ కు ఈ నెల 7వ తేదీన లోకేష్ సవాల్ విసిరారు.
undefined
ఈ నెల 14వ తేదీన వివేకానందరెడ్డి హత్య కేసుపై దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. ఈ సవాల్ లో భాగంగా లోకేష్ ఇవాళ అలిపిరి వద్ద లోకేష్ ప్రమాణం చేశారు. జగన్ ను కూడా ప్రమాణానికి రావాలని ఆయన కోరారు.
undefined
వైఎస్ వివేకానందరెడ్డి అంశం తెరమీదికి రావడంతో ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకోవడం ద్వారా సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. మరో వైపు ఈ కేసుతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని దేవుడిపై ప్రమాణం చేయడం ద్వారా ప్రత్యర్ధి కోర్టులోకి టీడీపీ బంతిని నెట్టింది.
undefined
ఓటమి భయంతోనే టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. రాళ్ల దాడి అంశం కూడ ఇందులో భాగమేనని వైసీపీ నేతలు టీడీపీపై ఎదురుదాడికి దిగింది.
undefined
click me!