అనంతపురం: హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని సినీహీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం నిరసనబాట పట్టిన బాలయ్య ఇవాళ(శుక్రవారం) హిందూపురంలో మౌన ప్రదర్శన చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకూ బాలయ్య మౌన ప్రదర్శన నిర్వహించారు.