ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ : తీవ్రవాదా.. ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా?.. మండిపడుతున్న నేతలు..

First Published Apr 23, 2021, 11:26 AM IST

సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును తెలుగుదేశం నాయకులు ఖండిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని విరుచుకుపడుతున్నారు. 
 

సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును తెలుగుదేశం నాయకులు ఖండిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని విరుచుకుపడుతున్నారు.
undefined
ధూళిపాళ్ల నరేంద్రది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు, జవహర్, పొలిట్ బ్యూరొ సభ్యులు కళా వెంకట్రావ్, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబులు ఖండించారు.
undefined
ప్రతిపక్షనేతలపై ప్రభుత్వ కక్ష ఎలా ఉందో చెప్పడానికి ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టే నిదర్శనం అన్నారు. సంగం డెయిరీ ఛైర్మన్ గా ఉన్న నరేంద్ర అవినీతికి పాల్పడ్డాడనడానికి ఆధారాలు లేవు. నరేంద్ర అరెస్ట్ తోఆయనకు, టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదని అశోక్ బాబు మండిపడ్డారు.జగన్ నేడు కక్షసాధింపులకు పాల్పడే నేతలకు రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుంది. మిల్క్ సొసైటీలకు ప్రభుత్వ సబ్సిడీలు వర్తించవు అన్నవారు, ఇప్పుడు ఏసీబీచట్టాన్ని ఎలా నరేంద్రకు ఆపాదిస్తారు. అధికారం ఉందికదా అని పోలీస్ బలగాన్ని ఉపయోగిస్తున్నారు.చట్టపరంగా పోరాటంచేస్తే, ప్రభుత్వం పెట్టే కేసులేవీ నిలవవు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం పెట్టే కేసులద్వారానే ఎవరి బలమేంటో తేలుతుంది. ప్రతిపక్ష నేతలందరినీ అరెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీని మిల్లీమీటర్ కూడా కదపలేడు. జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ మైండ్ సెట్ మార్చుకోకుంటే, చివరకు ఆయన్ని ఏవీ కాపాడలేవంటూ ధ్వజమెత్తారు.
undefined
ఇక తెలుగుదేశం నేత జవహర్ అముల్ కోసమే నరేంద్ర అరెస్ట్ అంటూ జగన్ మీద మండిపడ్డారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేయటంలో భాగంగానే అరెస్ట్ చేశారని, నోటీస్ లు ఇవ్వకుండా అరెస్ట్ ఏంటని ప్రశ్నించారు. ఇది ఏ రాజ్యాంగంలోనిదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.
undefined
దూళిపాళ్ల నరేంద్ర ఏం తప్పు చేశారు ? ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు ? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.తెల్లవారుజామున 100 మంది పోలీసులతో ఆయన ఇంటిని చుట్టుముట్టడం ఏంటి ఆయన ఏమన్నా టెర్రరిస్టా, ఉగ్రవాదా ? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.సంగం డైరీని నిర్వీర్యం చేసి దానిని అమూల్ కు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రజలను కాపాడలేని ప్రభుత్వం టీడీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు పెడుతోందని, దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలన్నారు.
undefined
ఏపీలో అరాచకపాలన నడుస్తోందని టీడీపీ నేత కళా వెంకట్రావ్ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకు జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడ్డారు.కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్నా, కరోనా కాటుకు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి...విపక్షాలపై రాజకీయ కక్షసాధింపు చర్యలపైనే దృష్టి పెడుతున్నారు. రాజకీయ జీవితంలో మచ్చలేని, స్వచ్ఛమైన నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర.
undefined
సంగం డెయిరీ చైర్మన్ గా పాడి రైతుకు అండగా నిలిచారు. గుజరాత్ కు చెందిన అమూల్ తో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని సంగం డెయిరీని దెబ్బతీసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. అందులో భాగంగానే ధూళిపాళ్లపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు.జగన్మోహన్ రెడ్డి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడదు. ధూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
undefined
ధూళిపాళ్ల అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పిరికిపందచర్య అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు దిగుతూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే అక్కసుతో టీడీపీ నేత, సంగం డెయిర్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఏమీ చేయలేక చివరకు దొంగదారిలో సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.ధూళిపాళ్ల ఏం తప్పు చేశారని ఆయన ఇంటికి 100 మంది పోలీసులను పంపారు? ఆయనేమైనా తీవ్రవాదా లేక ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా? సంగం డెయిరీ అభివృద్ధిలో ఏనాడూ రాజీ పడలేదు. నిరంతరం పాల ఉత్పత్తి దారుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందన్నారు.
undefined
గుజరాత్ కు చెందిన అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దూళిపాళ్ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు.రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయి. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని ఎద్దేవా చేశారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
undefined
click me!