ప‌రీక్ష‌లు ర‌ద్దుకు 48 గంట‌ల డెడ్‌లైన్‌... లేదంటే పోరాటమే..: లోకేష్ హెచ్చరిక

First Published Apr 22, 2021, 4:45 PM IST

క‌రోనా సెకండ్ వేవ్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఎదుర‌య్యే ప‌రిణామాల‌పై గురువారం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు, న్యాయ‌ నిపుణులు, విద్యార్థి సంఘ నేత‌ల‌తో టౌన్‌హాల్ స‌మావేశం జూమ్‌లో నిర్వ‌హించారు నారా లోకేష్.

అమరావతి: పిల్ల‌ల ప్రాణాల్ని లెక్క‌చేయ‌కుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మొండిగా ముందుకెళ్తున్న సీఎం జ‌గ‌న్‌రెడ్డిని మూర్ఖ‌పు రెడ్డిగా అనాల్సి వ‌స్తోంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 48 గంట‌లు స‌మ‌యం ఇస్తున్నామ‌ని... అప్ప‌టికీ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌క‌పోతే పిల్ల‌ల ప్రాణాలు ర‌క్ష‌ణే ల‌క్ష్యంగా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని లోకేష్ స‌ర్కారుకి హెచ్చ‌రించారు.
undefined
క‌రోనా సెకండ్ వేవ్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఎదుర‌య్యే ప‌రిణామాల‌పై గురువారం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు, న్యాయ‌ నిపుణులు, విద్యార్థి సంఘ నేత‌ల‌తో టౌన్‌హాల్ స‌మావేశం జూమ్‌లో నిర్వ‌హించారు లోకేష్. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... కోవిడ్‌19 వైర‌స్‌ ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్‌వేవ్‌ బాధితుల్లో చిన్నారులు, విద్యార్థులు ఎక్కువ‌గా ఉండ‌టం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. రాష్ట్రంలోని చిన్నపిల్లల వైద్యుల దగ్గరకు వస్తున్న కేసుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంద‌న్నారు. మన రాష్ట్రంలో 24 శాతం పాజిటివిటీ రేట్ ఉంద‌ని, అంటే ప్రతి వంద మందిలో 24 మందికి వైరస్ సోకుతోంద‌ని వెల్ల‌డి కావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం పడుతోంద‌న్నారు.
undefined
గ‌తేడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా పిల్ల‌ల‌కు కోవిడ్ వైర‌స్ వ్యాప్తి 11 శాతం అని, ఈ ఏడాది 20 నుంచి 40 శాతం వ్యాప్తి చెందింద‌ని ప్ర‌ముఖ చిన్న‌పిల్ల‌ల వైద్యులు డాక్ట‌ర్ సంజీవ్ బ‌గాయ్ చెప్ప‌డం ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా వుంద‌ని తేలుతోంద‌న్నారు. మ‌న రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ కలిపి 15 లక్షల మంది పిల్లలు పరీక్షలు రాయాల్సి వుంద‌ని, వీరి కుటుంబాలతో 75 ల‌క్ష‌ల మంది, 30 వేల మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాలతో క‌లిసి 50 వేల మంది, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌నిచేసే ఇత‌ర సిబ్బంది 3.5 ల‌క్ష‌ల మంది క‌లిపి దాదాపు కోటి మంది క‌రోనా బారిన‌ ప్ర‌మాదం ఉంద‌ని లోకేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 50 మంది ఉపాధ్యాయులు చ‌నిపోయారని పేర్కొన్నారు.
undefined
ఈ క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో మా అబ్బాయికి దేవాన్ష్‌కి ప‌రీక్ష‌లు ఉంటే ఒక తండ్రిగా ఎలా ఆలోచిస్తానో.. మీ అందరి గురించి అలాగే ఆలోచించాన‌న్నారు. క‌రోనాకి కుల‌, మ‌త‌, ప్రాంత, పేదా, పెద్ద అనే భేదాల్లేవ‌ని... అది వైర‌స్ అని... ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతూనే వుంటుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి త‌న మూర్ఖ‌త్వంతో ల‌క్ష‌ల మంది ప్రాణాలు ప‌ణంగా పెట్టి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డాన్ని అన్నివ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయ‌న్నారు.
undefined
క‌రోనా తొలి ద‌శ క‌ట్ట‌డిలో విఫ‌ల‌మైన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు పారాసెట‌మాల్‌, బ్లీచింగ్ అంటూ మైదా చ‌ల్లేసి, చివ‌రికి చేతులెత్తి స‌హ‌జీవ‌నం చేయ‌మంటూ పిలుపునివ్వ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌ర‌ణ‌మృదంగం మోగి వేలాది మందిని క‌రోనాకి బ‌లి అయ్యార‌న్నారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో క‌నీసం ఆస్ప‌త్రిలో బెడ్డు కూడా దొర‌క‌ని దుస్థితి నెల‌కొంటే ప్ర‌భుత్వం చేతులెత్తేసింద‌ని ఆరోపించారు. కోవిడ్ వ్యాప్తిలో దేశంలోనే 5వ స్థానంలో, వ్యాక్సిన్ వృధాలో 2వ స్థానంలో ఏపీ వుందంటే ఎంత నిర్ల‌క్ష్యంగా వుంటున్నారో అర్థం అవుతోంద‌న్నారు.
undefined
సచివాలయంలో అనేక మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డార‌ని, భార్యా,భర్త కోవిడ్ వల్ల చనిపోయినా సచివాలయంలోనే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేద‌న్నారు. అలాంటిది వేల పరీక్షా కేంద్రాల్లో జాగ్ర‌త్త‌లు ఎలా తీసుకుంటార‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కు కరోనా రాదని జగన్ రెడ్డి గ్యారెంటీ ఇవ్వగలగుతారా? అని లోకేష్ ప్ర‌శ్నించారు. రాజమండ్రిలో ఓ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ఒకేసారి కరోనా వచ్చి వీరు సూపర్ స్ప్రెడర్లుగా మారార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనివల్ల పట్టణంలో కేసులు కూడా పెరిగాయ‌న్నారు. పిల్లలు, పెద్దవాళ్లలో కూడా కొత్త కొత్త సింప్టమ్స్ వస్తున్నాయ‌ని, ఎలాంటి లక్షణాలు ఉన్నా వెంట‌నే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థుల‌కు ఆయ‌న సూచించారు.
undefined
విజయవాడలో ఓ మున్సిపల్ పాఠశాల ప్రిన్సిపల్ కు కరోనా వచ్చింద‌ని, అక్కడ చ‌దువుతున్న‌ 162 మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొంద‌న్నారు. క‌రోనా వ్యాప్తి చాలా వేగంగా జ‌రుగుతోన్న‌ హాస్టల్స్‌ని త‌క్ష‌ణ‌మే మూసేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా భ‌యంతో సీఎం జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటకు పెట్టడం లేద‌ని, విద్యార్థుల జీవితాల‌తో ఎలా ఆడుకుంటార‌ని ప్ర‌శ్నించారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ముఖ్య‌మంత్రికి త‌గ‌ద‌ని లోకేష్ సూచించారు.
undefined
click me!