ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

First Published | Jul 21, 2023, 4:06 PM IST

పార్టీ నేతల పనితీరుపై  చంద్రబాబు సర్వే నిర్వహించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకొనే వ్యూహంపై  పార్టీ నేతలతో చర్చించారు.

ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

టీడీపీ నేతల పనితీరుపై ప్రతినెల సర్వే నిర్వహించనున్నారు. రెండు విధాల సర్వేల ఆధారంగా  పార్టీలో పదవులను కట్టబెట్టనున్నారు చంద్రబాబునాయుడు

ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

ఈ విషయమై పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు ఈ నెల  20న సుదీర్ఘంగా చర్చించారు.  రానున్న  ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై  చర్చించారు. మరో వైపు  పార్టీ నేతలకు భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి   పార్టీలో  తీసుకు రానున్న విధానాల గురించి పార్టీ నేతలకు  చంద్రబాబు వివరించారు.

Latest Videos


ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

మంగళగిరి : వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రంగాల మాదిరిగానే ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసారు. ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు పోరాడుతున్నారని... వారికి తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుండి   నియోజకవర్గ స్థాయి వరకు  నేతల పనితీరుపై  సర్వే నిర్వహిస్తామని  చంద్రబాబు చెప్పారు.  అంతేకాదు  ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ రకంగా తమ వైపునకు తిప్పుకొనేందుకు  అనుసరించాల్సిన వ్యూహంపై  చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం  చేశారు.

ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

ప్రతి  నెల పార్టీలో ప్రతి కార్యకర్త, నేత ఏ రకమైన పనులు నిర్వహించారనే విషయమై  సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా  చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  గత మూడు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను  సమీక్షించనున్నారు. ఈ ఫలితాల ఆధారంగా రానున్న రోజుల్లో ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై  ప్లాన్  చేయనున్నారు.

ఇక నుండి ప్రతి నెల రెండు సర్వేలు: నేతల పనితీరుపై బాబు ఫోకస్

రాష్ట్ర ప్రభుత్వంపై  ప్రజా వ్యతిరేకతను ఎలా ఓటు రూపంలోకి మలుచుకొనే విషయమై నేతలతో చంద్రబాబు చర్చించారు.  క్షేత్రస్థాయిలో  ప్రజలతో ఉండాలని  చంద్రబాబు సూచించారు. కింది స్థాయి నుండి జిల్లా స్థాయి నేతల మధ్య సమన్వయం గురించి కూడ చంద్రబాబు నొక్కి చెప్పారు.  పార్టీ కోసం  పనిచేసే వారికే  రానున్న రోజుల్లో  పార్టీలో పదవులు దక్కుతాయని చంద్రబాబు తేల్చి చెప్పారు.  మరో వైపు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే   ఇలాంటి వారికే  పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా  కూడ  చంద్రబాబు  తేల్చి చెప్పారు

chandrababu naidu

అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదనే విమర్శలు చంద్రబాబుపై  ఉన్నాయి. ఇక నుండి ఆ పరిస్థితి ఉండదని  చంద్రబాబు  క్యాడర్ కు హామీ ఇస్తున్నారు.

click me!