ఇంట్లో వజ్రాలనిధి.. అందుకే అమ్మాయికి ధనపిశాచి... వదిలిస్తానంటూ మంత్రగాడు చేసిన పని..

Published : Jul 21, 2023, 01:41 PM IST

ఇంట్లో వజ్రాలనిధి ఉందని.. అందుకే అమ్మాయికి ధనపిశాచి పట్టిందని నమ్మించాడో మాంత్రికుడు. బెడ్రూంలో నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. 

PREV
18
ఇంట్లో వజ్రాలనిధి.. అందుకే అమ్మాయికి ధనపిశాచి... వదిలిస్తానంటూ మంత్రగాడు చేసిన పని..

చిత్తూరు : ఓ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని దర్గాకు వెళ్లిన తల్లిదండ్రులను ఓ మాంత్రికుడు ఏమార్చాడు. అమ్మాయికి ధనపిశాచి పట్టిందని జోస్యం చెప్పాడు. ఎక్కడికి తీసుకువెళ్లినా.. అది నయం కాదని నమ్మించాడు. మీ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. దానిని పట్టుకున్న ధనపిశాచి మీ కూతురి ఒంట్లో చేరింది.  అందుకే ఆమె జబ్బున పడింది. అని కట్టు కథలు చెప్పి, వారిని  నమ్మించాడు.

28

దీనికి సంబంధించి పలమనేరు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వివరాలు ఇలా తెలిపారు… చిత్తూరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన సయ్యద్ భాషా కుమార్తెకు కొద్దిరోజులుగా ఆరోగ్యం అసలు బాగాలేదు. ఆమెకు ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన నయం కావడం లేదు. దీంతో గాలి సోకి ఉంటుందని ఎవరో చెప్పారు. అది నమ్మిన సయ్యద్ భాష కూతురిని మదనపల్లి దగ్గర ఉన్న యాతాలలంక వద్ద దర్గాకు తీసుకెళ్లాడు. 

38

అక్కడ సయ్యద్ భాషా భార్యకు దూరపు బంధువైన ఒక వ్యక్తి కనిపించాడు. అతని పేరు అజీజ్ అలీ. సయ్యద్ భాషను గుర్తుపట్టి ఏం జరిగిందని ఆరా తీశాడు. తన కూతురికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇక్కడికి తీసుకు వచ్చినట్టు చెప్పాడు. తనకు ఒక స్నేహితుడు ఉన్నాడని, అతనికి చూపిస్తే ఎలాంటి రోగాన్నైనా ఇట్టే నయం చేస్తాడని నమ్మించాడు.

48

తామిద్దరూ కలిసి గంటావూరుకే వస్తామని చెప్పాడు. అలా మదనపల్లెకు చెందిన రెడ్డి నరసింహులుతో కలిసి అజీజ్ అలీ.. సయ్యద్ భాష ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఉన్న కూతురిని పరిశీలించారు. ఇంట్లో భారీగా వజ్రాలు ఉన్నాయని అందుకే ఆమె అనారోగ్యం పాలు అయిందని తెలిపారు. ఆమెకు ధనపిశాచి పట్టిందని నమ్మించారు.

58

దీనికి విరుగుడు లేదా అని అడగగా…. ఓ మంచి ముహూర్తం చూసి మీ ఇంట్లోని వజ్రాలను బయటికి తీయాలని.. అలా తీసిన వాటిల్లో నుంచి ఓ వజ్రాన్ని కూతురి చేతికి ఉంగరంగా తొడిగితే ఆరోగ్యం నయం అవుతుందని చెప్పారు. దీనిని నమ్మిన సయ్యద్ భాష అలాగే చేయమని కోరాడు. దీంట్లో భాగంగానే ఈనెల 18వ తేదీ అమావాస్య రోజు సయ్యద్ భాష ఇంట్లోని బెడ్రూంలో ఐదు అడుగుల గోతితవ్వారు.

68

అక్కడే గుప్తనిధులు ఉన్నాయని చెప్పి ఇద్దరు పూజలు చేశారు. ఆ తర్వాత రెండు విలువైన వజ్రాలు లభించాయని చెబుతూ నకిలీ వజ్రాలను సయ్యద్ భాషకి ఇచ్చారు. అలా అతని దగ్గర నుంచి పూజ ఖర్చులు అంటూ రూ. 20000 తీసుకున్నారు. ఆ గోతిలోనే ఇంకా చాలా వజ్రాలు ఉన్నాయని నమ్మించారు. అవన్నీ వెలికి తీయాలంటే ఇంకా చాలా ఖర్చు అవుతుందని సయ్యద్ భాషను నమ్మించారు. 

78

సయ్యద్ భాష ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్టుగా ఇంటి చుట్టుపక్కల వారికి తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు నిఘా పెట్టారు. అయితే, సయ్యద్ భాషా కూడా స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు కూడా ఈ విషయాల మీద అనుమానం ఉందంటూ తెలిపాడు. 

88

గురువారం నాడు అజీజ్ అలీ, నరసింహులు మళ్లీ గంటావూరులోని సయ్యద్ బాషా ఇంటికి వచ్చారు.  దీంతో వీరిద్దరిని  పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరిని విచారించగా..  అవి నిజమైన వజ్రాలు కాదని నకిలీ వజ్రాలతో మోసం చేసినట్టుగా అంగీకరించారు. దీంతో పోలీసులు నిందితులను రిమాండ్ కు పంపించారు. 

click me!

Recommended Stories