టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.అయితే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రూపంలో తెలుగుదేశానికి తలనొప్పులు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం ఆ పార్టీని ఇబ్బందికి గురి చేస్తుంది.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఖమ్మంలో ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ ముగించారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైద్రాబాద్ కు తిరిగి వెళ్తున్న సమయంలో సూర్యాపేటకు సమీపంలోని చివ్వెంల వద్ద రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ కాలు విరిగింది. ఆసుపత్రిలో బెడ్ పై పడుకొని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
ఆ తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య దూరం పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో కూడ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి కూడ ఆయన హాజరు కాలేదు.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
గతంలో చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని టీడీపీ కార్యకర్త ఒకరు చంద్రబాబును కోరారు.దీంతో చంద్రబాబు టీడీపీ కార్యకర్తకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటన సమయంలో కూడ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న జెండాలతో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశాయి. మరో వైపు చిలకలూరిపేటలో గత ఏడాది అక్టోబర్ మాసంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో కూడ చంద్రబాబు ఇదే రకమైన అనుభవం ఎదురైంది.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ జెండాలు, ప్లెక్సీలతో చంద్రబాబు ర్యాలీలో రచ్చ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
2022 ఆగష్టు 22న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు.ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత లేదని బీజేపీ నేతలు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుత నటన గురించి తారక్ ను అమిత్ షా అభినందించారని బీజేపీ నేతలు ప్రకటించారు.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
గత కొంతకాలంగా అవకాశం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ర్యాలీల్లో రచ్చ చేస్తున్నారు. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు, జెండాలను ప్రదర్శిస్తున్నారు.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
హరికృష్ణ మరణించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుకు మరింత గ్యాప్ పెరిగిందనే ప్రచారం లేకపోలేదు.హరికృష్ణకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మధ్య మంచి అనుబంధం ఉందని చెబుతారు.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలను నందమూరి కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. పేరు ప్రస్తావించకుండానే జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లోకేష్ ఏపీ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అంటూ ఆ ఫ్లెక్సీలో ఉంది.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
రాజకీయంగా లోకేష్ కు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారనే ప్రచారం కూడ లేకపోలేదు.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌తో తలనొప్పులు: బాబు ఎలా చెక్ పెడతారో?
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను పురంధేశ్వరి చేపట్టారు. ఈ పరిణామం కూడ టీడీపీ చీఫ్ చంద్రబాబుకు కొంత ఇబ్బందికర పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని టీడీపీ పరిష్కరించుకోకపోతే ఈ తలనొప్పులు కొనసాగే అవకాశం లేకపోలేదనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా నారా, నందమూరి కుటుంబాల మధ్య గ్యాప్ లేదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తే ఈ రకమైన తలనొప్పులకు చెక్ పడే అవకాశం ఉంది. ఈ దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తారా, జూనియర్ ఎన్టీఆర్ రానున్న ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరిస్తారోననేది సర్వత్రా ఆసక్తిగా మారింది.