Andhra Pradesh: తల్లికి వందనం రెండో విడత డబ్బులు..విడుదల చేసేది ఆ రోజే..!

Published : Jul 03, 2025, 11:23 AM IST

తల్లికి వందనం రెండో విడత జూలై 10న విడుదల. Class 1, Inter First Year, RTE విద్యార్థులకు రూ.13,000 చొప్పున నిధులు జమ కానున్నాయి.

PREV
16
తల్లికి వందనం

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కీలక విద్యా సంక్షేమ పథకాలలో ఒకటైన ‘తల్లికి వందనం’ పథకం తొలి విడత కింద జూన్ 12న ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి విద్యార్థి తల్లికి రూ.13,000 చొప్పున నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. అయితే, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని వేల మంది విద్యార్థులకు డబ్బులు జమ కాలేదు. దీంతో ప్రభుత్వం తక్షణమే పునఃసమీక్ష చేపట్టి రెండో విడత నిధులు జూలై 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

26
జులై 5కి బదులుగా జులై 10న విడుదల

 జులై 5న రెండో విడత నిధులు పంపిణీ చేస్తామని ప్రకటించినా, కొన్ని జిల్లాల్లో ఇంకా అడ్మిషన్లు కొనసాగుతుండటంతో తేదీని జులై 10కి మార్చారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్స్ కూడా జరుగనున్న నేపథ్యంలో అదే రోజునే డబ్బులు జమ చేయనున్నారు.

36
లబ్ధిదారుల సంఖ్య

ఒకటో తరగతి విద్యార్థులు: సుమారు 5.5 లక్షల మంది

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు: సుమారు 4.7 లక్షల మంది

వీరందరికీ జూలై 10న రూ.13వేలు చొప్పున నిధులు జమ కానున్నాయి.

46
రెండో విడతలో నిధులు పొందే విద్యార్థులు

 రెండో విడతలో నిధులు పొందే విద్యార్థులు  కొత్తగా Class 1లో చేరిన విద్యార్థులు

కొత్తగా Inter First Yearలో చేరిన విద్యార్థులు

Right to Education (RTE) కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హ విద్యార్థులు

తొమ్మిదో తరగతి, పదో తరగతి, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు (వీరికి కార్పొరేషన్ల ద్వారా కాస్త ఆలస్యంగా నిధులు జమ అవుతాయి)

56
తాత్కాలిక మినహాయింపులు ఉన్న విద్యార్థులు

తాత్కాలిక మినహాయింపులు ఉన్న విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల లిస్టులు ఆధారంగా నిధులు జమ చేస్తున్నారు.

కేంద్రీయ విద్యాలయాల (KVs) విద్యార్థులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

గతంలో 300 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగం ఉన్న గృహాలు "అర్హతలేనివిగా" గుర్తించబడ్డాయి. అయితే, తాజా NBM డేటాలో 300 యూనిట్లకు తక్కువ వినియోగం చూపిన కుటుంబాలు ఉంటే, వారికి కూడా నిధులు జమ కానున్నాయి.

66
డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలి?

డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలి? తల్లికి వందనం అధికారిక వెబ్‌సైట్ లేదా AP విద్యాశాఖ పోర్టల్‌కు వెళ్ళాలి

విద్యార్థి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి

'Status Check' బటన్ క్లిక్ చేసి డబ్బులు జమ అయ్యాయా? లేదా? అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు

Read more Photos on
click me!

Recommended Stories