హోంమంత్రి సుచరిత సంచలన కామెంట్స్: చంద్రబాబు విశాఖ టూర్‌పై వీడని సస్పెన్స్

First Published May 24, 2020, 6:15 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విశాఖ పట్టణం పర్యటనకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ టూర్ కు సంబంధించి బాబు అనుమతి కోసం చేసుకొన్న ధరఖాస్తు తమకు అందలేదని ఏపీ హోంశాఖ మంత్రి ప్రకటించారు.దీంతో బాబు టూర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విశాఖ పట్టణం పర్యటనకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ టూర్ కు సంబంధించి బాబు అనుమతి కోసం చేసుకొన్న ధరఖాస్తు తమకు అందలేదని ఏపీ హోంశాఖ మంత్రి ప్రకటించారు.దీంతో బాబు టూర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
undefined
ఈ నెల 7వ తేదీన విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 12 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన రోజునే విశాఖపట్టణం వెళ్లేందుకు చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు అనుమతి కోసం లేఖ రాశాడు. బాబుకు ఈ విషయమై అనుమతి రాలేదు.
undefined
లాక్ డౌన్ కు ముందు నుండే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో ఉంటున్నాడు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి విమానాల రాకపోకలను ప్రారంభం కానున్నాయి. చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్లేందుకు తెలంగాణ డీజీపీతో పాటు ఏపీ డీజీపీలను అనుమతి కోరుతూ ఈ నెల 23వ తేదీన ధరఖాస్తు చేసుకొన్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
undefined
ఈ ధరఖాస్తుకు సంబంధించిన ప్రతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పోలీసు ఉన్నతాధికారులకు కూడ పంపినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నట్టుగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.
undefined
అయితే ఆదివారం నాడు మధ్యాహ్నం ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత చంద్రబాబు విశాఖ పట్టణం టూర్ పై కుండబద్దలు కొట్టారు. చంద్రబాబునాయుడు విశాఖ టూరు కోసం ధరఖాస్తు చేసుకొంటే ఆధారాలు చూపాలని ఆమె కోరారు.
undefined
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పీసీసీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు ఎల్జీ బాధితులను పరామర్శకు వెళ్లడానికి ధరఖాస్తు చేసుకొంటే అనుమతులు ఇచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ధరఖాస్తు చేసుకొంటే వెంటనే అనుమతులు వస్తాయన్నారు.
undefined
కేంద్రానికి చంద్రబాబునాయుడు అనుమతుల కోసం ధరఖాస్తులు చేసుకొంటే తాము ఏం చేస్తామని హోం మంత్రి ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు ధరఖాస్తులకు సంబంధించిన ఆధారాలను చూపెట్టాలని ఆమె కోరారు.
undefined
ఈ నెల 25వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి విశాఖపట్టణానికి విమానంలో చంద్రబాబు బయలుదేరనున్నారు. అయితే తెలంగాణ నుండి విశాఖకు వెళ్లేందుకు తెలంగాణ డీజీపీ నుండి అనుమతి వచ్చినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
undefined
విశాఖలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబుకు అనుమతి లభిస్తోందా అనే విషయమై సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు. విశాఖలో బాధితులను పరామర్శించిన తర్వాత ఆయన అక్కడి నుండి ఉండవల్లికి చేరుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు.తమకు అనుమతి కోసం చంద్రబాబు ధరఖాస్తు చేసుకోలేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో చంద్రబాబు ఏం చేస్తారో అనేది కూడ అందరూ గమనిస్తున్నారు.
undefined
click me!