లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు మాసాలుగా భక్తులకు దర్శనం నిలిచిపోయింది. శ్రీవారి లడ్డును జిల్లా కేంద్రాల్లో రూ. 25లకు విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. రెండు మాసాలు ఆలయాన్ని మూసివేసినా కూడ ఆన్‌లైన్ ఆదాయం మాత్రం గత ఏడాదితో ఈ ఏడాది పెరిగింది.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. సరిగ్గా ఇవాళ్టికి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసి రెండు మాసాలు అవుతోంది.
undefined
లాక్ డౌన్ ను ఈ నెలాఖరువరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మే 31వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
undefined
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వాల సూచనల మేరకు భక్తులకు వెంకన్న దర్శనం విషయంలో టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. తొలుత టీటీడీలో పనిచేసే భక్తులకు ఆ తర్వాత తిరుమల, తిరుపతిలో ఉండే భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ ప్లాన్ చేసింది. గంటకు 500 మంది చిప్పున దర్శనం కల్పించనున్నారు.
undefined
లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులకు స్వామి వారి దర్శనం లేకుండాపోయింది. కానీ, స్వామికి ఏకాంత సేవలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రతి రోజు తిరుమల వెంకన్నను 80 వేల నుండి లక్ష మంది భక్తులు దర్శించుకొంటారు.
undefined
ప్రతి నెలా టీటీడీకి సుమారు రూ. 200 నుండి రూ.220 కోట్ల ఆదాయం వస్తోంది. భక్తుల రాకపోకలు లేకపోవడంతో ఈ ఆదాయాన్ని కోల్పోయింది. రెండు నెలల్లో సుమారు రూ. 400 నుండి 500 కోట్ల ఆదాయాన్ని టీటీడీ కోల్పోయిందని అంచనా.
undefined
భక్తులు ఆలయానికి రాకపోయినా కూడ ఆన్ లైన్ లో మాత్రం స్వామివారికి కానుకలను సమర్పించుకొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో ఆన్ లైన్ లో టీటీడీకి రూ. కోటి 79 లక్షల ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో గత ఏడాది ఏప్రిల్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రూ. కోటి 97 లక్షల ఆదాయం వచ్చింది.
undefined
తిరుపతి వెంకన్న దర్శనం కల్పించలేకపోయినా కూడ భక్తులకు మాత్రం లడ్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. ప్రతి జిల్లా కేంద్రంలోని టీటీడీ కార్యాలయాల ద్వారా రూ. 25లకే లడ్డును భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.
undefined
భక్తులకు స్వామి వారి దర్శనం కోసం ప్రతి ఒక్కరూ కోరుతున్నారని... కానీ ఎప్పుడు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామో ఇప్పుడే చెప్పలేమని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం నాడు ప్రకటించారు.
undefined