శ్రీశైలం: కర్నూల్ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ను సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్న మహారుద్ర శత చండీయాగంలో పాల్గొన్నారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన దేశ అత్యున్నత న్యాయమూర్తికి దేవాదాయ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు.