Andhra Pradesh: తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Published : Mar 06, 2022, 12:17 PM ISTUpdated : Mar 06, 2022, 12:18 PM IST

Andhra Pradesh: సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చీఫ్ జస్టిస్ రమణకు వేదపండితులు స్వాగతం పలికారు.  

PREV
15
Andhra Pradesh: తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

దర్శనానంతరం ఆయనకు వేదశీర్వచనం అందించి తీర్థప్రసాదాలతో పాటు ఇటీవల విడుదల చేసిన అంజనాద్రి-హనుమాన్ జన్మస్థలం పుస్తకాన్ని చైర్మన్ మరియు ఈవో అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేఐ.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భక్తులకు సర్వ దర్శనం పునఃప్రారంభం కావడం గొప్ప విషయమన్నారు. "భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాధులు మళ్లీ రాకుండా చూసేలా ప్రపంచాన్ని రక్షించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను" అని ఆయన పేర్కొన్నారు.
 

25

పరిశుభ్రతతో పాటు తిరుమల పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆయన శ్రీ బేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని కుటుంబ సమేతంగా అఖిలాండం వద్ద పూజలు చేశారు. స్థానిక శాసనసభ్యులు బి కరుణాకర్ రెడ్డి, సివిఎస్‌వో  గోపీనాథ్ జట్టి, డివైఇఓలు హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

35

అంత‌కు ముందు మహా ద్వారం వద్దకు చేరుకున్న సీజేఐ ఎన్వీ ర‌మ‌ణతో స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి లు స్వాగతం పలికారు. శాలువా కప్పి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను సత్కరించారు.
 

45

Andhra Pradesh: దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుప‌తి వెంక‌న్న‌కు పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు  చేశారు. సీజేఐ కుటుంబ స‌భ్యుల‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
 

55

జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల రావడంతో ఆయన పద్మావతి అతిధి గృహంలో పంచగవ్వ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈరోజ మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి తిరుచానూరులోని పద్మావతి ఆలయాన్ని సందర్శిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories